టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇంట తాజాగా విషాదఛాయలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తన నానమ్మ ఆగ్నేసమ్మ  సోమవారం అర్ధరాత్రి మరణించినట్లుగా తెలియజేశారు. ఈమె వయసు 88 సంవత్సరాలు. సందీప్ కిషన్ నానమ్మ విశాఖపట్నంలో పలు ప్రాంతాలలో టీచర్గా పనిచేసింది. అయితే గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ మరణించినట్లుగా సమాచారం. మంగళవారం రోజున చర్చిలో భూస్థాపన నిర్వహించగా అందులో హీరో సందీప్ కిషన్ కూడా పాల్గొని తన నానమ్మకు నివాళులు అర్పించారు.



తన నానమ్మ గురించి తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో తెలియజేస్తూ ఒక ఎమోషనల్ పోస్టును కూడా షేర్ చేశారు హీరో సందీప్ కిషన్.. నిన్నటి రోజున మేము మా నానమ్మను కోల్పోయాము మా నానమ్మ, మా తాత కృష్ణం నాయుడు ఒక షీప్ ఆర్కెటిక్ అవ్వగా తన నానమ్మ ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా కూడా పనిచేసింది అంటూ తెలియజేశారు. 1960లో  పెళ్లి చేసుకున్నారని.. అలా పెళ్లి చేసుకున్న తర్వాత తన తాతగారు జోసెఫ్ కృష్ణం నాయుడు, నానమ్మ ఆగ్నేస్ లక్ష్మీ చాలా బాగా ఉండేవారని నిజంగా తనకు తెలిసిన ఒక గొప్ప ప్రేమ కథ వీళ్ళదే అంటూ తెలియజేశారు. మిస్ యు నానమ్మ.. ఐ లవ్ యు అంటూ ఒక ఎమోషనల్ పోస్టును సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది సందీప్ కిషన్. ఈ పోస్ట్ చూసిన తర్వాత అభిమానులు కూడా సందీప్ కిషన్ కి ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.


హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు సందీప్ కిషన్. అవసరమైతే ఇతర హీరోల చిత్రాలలో కూడా కీలకమైన పాత్రలో నటించడానికి సిద్దమయ్యారు. చివరిగా మజాకా అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సందీప్ కిషన్ ప్రస్తుతం వైబ్ అనే సినిమా లో నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: