
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్ మార్కెట్ ను పెంచుకుంటున్నారు. అయితే ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు కేవలం 75 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఈ పారితోషికం ఒకేసారి తీసుకోవడంతో ప్రభాస్ పరిమితంగానే పారితోషికం తీసుకోవడం జరిగింది. ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ భారీ స్థాయిలో పెరుగుతోంది.
ప్రభాస్ క్రేజ్ తగ్గిందని అందుకే తక్కువ పారితోషికం తీసుకున్నారని కొన్ని కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ చెత్త ప్రచారాన్ని ఆపండంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరిన్ని రికార్డులను సొంతం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజాసాబ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.
ది రాజాసాబ్ సినిమా టీజర్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం సంచలనాలు సృష్టించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలతో నిధి అగర్వాల్ తలరాత సైతం మారుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ది రాజాసాబ్ టీజర్ ఈ స్థాయిలో ఉంటే ట్రైలర్ ఏ స్థాయిలో ఉంటుందో అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ది రాజాసాబ్ సినిమా నిడివి మూడు గంటలు అని సమాచారం అందుతోంది. మారుతి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సాధించడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ది రాజాసాబ్ సినిమాకు యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ది రాజాసాబ్ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృస్తిస్తుందో చూడాలి. ది రాజాసాబ్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.