గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో దిల్ రాజు బ్రదర్ శిరీష్ మాట్లాడిన మాటల తాలూకా వీడియో ఏ విధంగా వైరల్ అవుతుందో మనం చూస్తూనే వచ్చాం. మరీ ముఖ్యంగా శిరీష్ ఆ  ఇంటర్వ్యూలో చాలా నిజాయితీగా  గా మాట్లాడాడు అంటూ చాలామంది జనాలు కామెంట్ చేశారు . అయితే అందరి  కామెంట్స్ ఎలా ఉన్నా కూడా రాంచరణ్ ఫ్యాన్స్ మాత్రం శిరీష్ పై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు . దానికి కారణం గేమ్ చేంజెర్ సినిమా . గేమ్ చేంజెర్ సినిమా ప్లాప్ అయిన తర్వాత అసలు మేము ఎలా ఉన్నాం? ఏం చేస్తున్నామని ఒక్క ముక్క కూడా డైరెక్టర్ అదేవిధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పట్టించుకోలేదు అనే విధంగా శిరీష్ కామెంట్ చేశాడు .
 

అప్పటినుంచి శిరీష్ మీద మెగా ఫాన్స్ ఫైర్ అవుతూ వచ్చారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పేరుతో ఒక లేఖ సోషల్ మీడియాలో రిలీజ్ అయింది . "ఇది గమనిక కాదు హెచ్చరిక అంటూ 6 పాయింట్ లు మెన్షన్ చేసి స్ట్రైట్ వార్నింగ్  ఇచ్చేశారు". ఆ పాయింట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఒక పాయింట్ మాత్రం మెగా ఫాన్స్ హైలెట్గా అడిగారు. " సినిమా అనేది ఒక బిజినెస్ . దానిలో లాభాలు.. నష్టాలు .. రెండు వస్తాయి అది మీకు కూడా తెలుసు . మీ ప్రొడక్షన్ హౌస్ లో మీరు చేసే సినిమాలు అన్నీ మీ వల్లే విజయాలు .. మీ వల్లే  లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి మాత్రం అది వేరే వాళ్ల మీద ఆపాదించడం ఎంతవరకు సమంజసం..??" అంటూ స్ప్రైట్ ఫార్ వార్డ్ గా ప్రశ్నించారు .

 

ఇక ఆ ఆరు పాయింట్ల విషయానికి వస్తే..

1. వన్ నేనొక్కడినే టైంలో 14రీల్స్  సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా ..?

2. మైత్రి బ్యానర్ లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా.. ఎవరినైనా.. హీరోల గురించి సంభాషించారా..?

3. సైధవ్ సినిమా ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు..?

4."సంక్రాంతికి వస్తున్నాం" సినిమా హిట్ అయింది అని మీరే చెప్తున్నారు . వెంకటేష్ కి ఎంత ఇచ్చారు..? ముందు మాట్లాడుకున్నంత ఇచ్చారా..? ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారా?

5. దర్శకుడు శంకర్ ఉన్నాడు అని వెళ్ళింది ఎవరు ..? ఒక సంవత్సరం అంటూ మూడు సంవత్సరాలు టైం వేస్ట్ చేసింది ఎవరు?

6. ఆర్ ఆర్ ఆర్ తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు ఈ విధంగా విషం చిమ్మడం కరెక్టేనా..?



మా అభిమానులు మూడేళ్లుగా ఒక సినిమా కోసం ఎదురు చూసి చూసి విసుకు చెందారు . అది కూడా ఫ్లాప్ అయింది.  ఆ మానసిక క్షోభ మాకు ఇంకా తగ్గలేదు . అది తగ్గించాల్సింది పోయి మీరే ఇలా రోజుకు రోజుకు గేమ్ ఛేంజర్  ఫ్లాప్ ఫ్లాప్ అంటూ మమ్మల్ని బాధ పెడుతున్నారు . ప్రతి ప్రెస్ మీట్ లో అవసరం ఉన్న అవసరం లేకపోయినా ప్రతి ఇంటర్వ్యూలో కావాలనే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకు కోపానికి గురిచేస్తున్నారు.  ఇదే ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి గేమ్ ఛేంజర్  సినిమా గురించి ఎవ్వరైనా సరే ఎక్కడైనా సరే మాట్లాడిన రాంచరణ్ గురించి నెగిటివ్గా మాట్లాడిన. తప్పుగా అర్థం వచ్చేలా కౌంటర్స్ వేసిన  తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఖబడ్దార్..!!! ఇట్లు రామ్ చరణ్ అభిమానులు అంటూ ఓలేఖ రిలీజ్ చేశారు . ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కొంతమంది రామ్ చరణ్ ఫ్యాన్స్ నిర్మాత శిరీష్ ని నోరు మూయ్..నువ్వు నీ వేషాలు ..పోయి పని చూసుకో అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తూ మాట్లాడుతున్నారు . చూస్తుంటే ఈ వార్ మరింత హీట్ పెంచేలా సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తుంది. చూడాలి మరి దీని పై దిల్ రాజు ఆయన బ్రదర్ శిరీష్ ఎలా స్పందిస్తారు అనేది..???





మరింత సమాచారం తెలుసుకోండి: