మంచు విష్ణు టైటిల్ పాత్ర‌లో ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మైథాల‌జిక‌ల్ ఫిల్మ్ `క‌న్న‌ప్ప‌`. దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్ తో మోహ‌న్ బాబు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌భాస్‌, అక్ష‌య్ కుమార్‌, మోహ‌న్ లాల్ వంటి టాప్ స్టార్స్ ను రంగంలోకి దింపి సినీ ప్రియుల్లో మంచి హైప్ క్రియేట్ చేశారు. అందుకు త‌గ్గ‌ట్లే భారీ అంచ‌నాల‌తో జూన్ 27న విడుద‌లైన క‌న్న‌ప్ప పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.


పరమ శివుడి భక్తుడైన కన్నప్ప పురాణగాథ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం బాగుంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డ్డారు. దాంతో మంచు విష్ణు కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను క‌న్న‌ప్ప సొంతం చేసుకుంది. పోటీగా కుబేర ఉన్న కూడా వీకెండ్ వ‌ర‌కు ఈ మూవీ థియేట‌ర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. కానీ మండే నుంచి అస‌లు ప‌రీక్ష మొద‌లైంది. వీక్ డేస్ స్టార్ట్ అవ్వ‌గానే క‌న్న‌ప్ప క‌లెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి.


తాజాగా క‌న్న‌ప్ప 5 డేస్ క‌లెక్ష‌న్స్ లెక్క‌లు బ‌య‌టకు వ‌చ్చాయి. ఏపీ మ‌రియు తెలంగాణ‌లో ఐదు రోజుల థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసే స‌మ‌యానికి ఈ సినిమా రూ. 14.73 కోట్ల షేర్‌, రూ. 25.45 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా 5 డేస్ లో రూ. 21.33 కోట్ల షేర్‌, రూ. 41.10 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయ‌ని అంటున్నారు. క‌న్న‌ప్ప బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 81 కోట్లు. ఈ టార్గెట్ ను రీచ్ కావాలంటే ఇంకా రూ. 59.67 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కానీ ఇప్పుడున్న పెర్ఫార్మెన్సే కొన‌సాగితే క‌న్న‌ప్ప బ్రేక్ ఈవెన్ అవ్వ‌డం క‌ష్ట‌మే అని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: