నితిన్ లిస్టులో మరో ప్లాప్ పడిపోయింది .. తమ్ముడు కూడా నితిన్ కి సక్సెస్ ఇవ్వలేకపోయాడు .. తాజాగా ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచి అట్టర్ ప్లాఫ్ టాక్ వచ్చింది .. భీష్మ తర్వాత నితిన్ కి సరైన హిట్‌ లేదు .. చెక్ , మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం , ఎక్స్ ట్రా , రాబిన్ హుడ్ ఇలా అన్నీ వరస డిజాస్టర్లే .. అయితే వీటి మధ్యలో ‘రంగ్ దే’ ఒకటే యావరేజ్ టాక్ తెచ్చుకుంది .. ఇక ఇప్పుడు తమ్ముడు రూపంలో నితిన్ మరో కొత్త జోనర్ టచ్ చేసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది . ఈ సినిమాతో నితిన్ కెరీర్ మరింత దిగజారిపోయిందనే చెప్పాలి .


ఇక ఇప్పుడు నితిన్ చేతిలో రెండు  సినిమాలు మాత్రమే ఉన్నాయి .. అందులో ఒకటి ఎల్లమ్మ .. తమ్ముడు రిజల్ట్ తర్వాత ఎల్లమ్మ ముందుకు వెళుతుందా, లేదా ? అనేది కూడా పెద్ద క్వశ్చన్ గా మారింది .. ఎందుకంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజునే .. తమ్ముడు డిజాస్టర్ అయ్యాక .. నితిన్ తో దిల్ రాజు మళ్లీ పెద్ద సాహసం చేస్తారా ? అనేది కూడా డౌటే . అలాగే ఎల్లమ్మకు బలగం డైరెక్టర్ వేణు దర్శకుడు .. బలగం తర్వాత వేణు చేస్తున్న సినిమా ఇదే .. అయితే ముందుగా నానిని హీరోగా అనుకున్నారు .. ఆ తర్వాత నితిన్ దగ్గరకు స్టోరీ వచ్చి ఆగింది .. బలగంలా అతి తక్కువ బడ్జెట్ తో చేసే సినిమా కూడా కాదు .. కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాలి .. నితిన్ పై ఇది వర్క్ అవుతుందా ? అనే ఆలోచ‌న‌ల్లో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తుంది .



అలాగే తమ్ముడు సినిమాకు నితిన్  పారితోషికం తీసుకోలేదు .. సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా తీసుకోవచ్చు అన్న షరతు తో సినిమా ను మొదలు పెట్టారు .. ఇలా చేసినా తమ్ముడు ఆర్దికంగా గ‌ట్టెక్క‌లేదు .. ఇక ఇప్పుడు ఎల్లమ్మని కూడా ఇదే రూట్ లో మొదలుపెట్టిన .. సినిమా అటు ఇటు అయితే తమ్ముడు లానే సీన్ తయారవుతుంది .. అందుకే దిల్ రాజు ఏం చేస్తారు ? ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్తారా, వెళితే నితిన్ హీరోగా ఉంటారా ? ఇలా ఎన్నో ప్రశ్నలు , అనుమానాలు బయటికి వస్తున్నాయి .. దిల్ రాజు కూడా తమ్ముడు రిజల్ట్ తర్వాత ఎల్లమ్మని మొదలుపెడతామని ఇప్పటిదాకా ఆగారు .. ఇక ఇప్పుడు ఫలితం తేలిపోయింది .. ఇక మరి నెక్స్ట్ స్టాప్ ఏంటి అనేది దిల్ రాజు చేతుల్లోనే ఉంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: