
అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులకు సంబంధించిన డీల్ దాదాపుగా పూర్తైనట్టేనని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ రావడంతో పాటు బుల్లితెరపై కూడా ఈ సినిమా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. అందువల్ల అనిల్ రావిపూడి తర్వాత సినిమాలకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది. ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
దాదాపుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా విశ్వంభర సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు కానున్నాయి. చిరంజీవి తాను హీరోగా తెరకెక్కుతున్న సినిమా హిట్టయ్యేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ లో సినిమా పూర్తీ చేయడం, ప్రొడ్యూసర్ల డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడం అనిల్ రావిపూడి మేలు చేసింది..
అనిల్ రావిపూడి తొందరగా తీస్తాడని, సమయానికి రిలీజ్ చేస్తాడని, హిట్ సినిమా తీస్తాడని ముఖ్యముగా డబ్బులు వచ్చే సినిమా తీస్తాడని ఇండస్ట్రీలో టాక్ ఉండటం ప్లస్ అయింది. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం అనిల్ రావిపూడి మ్యాజిక్ చేయడంతో పాటు మరిన్ని రికార్డులను బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వరుస విజయాలు ఉన్నా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పరిమితంగానే పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.