
ఈ సినిమాలో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి టేకింగ్ వేరే లెవల్లో ఉందని ఇండస్ట్రీ టాక్. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ముఖ్యమైన హైలైట్‌గా నిలవనుంది . సినిమాటోగ్రఫీ , యాక్షన్ కంపోజిషన్స్ అంతా హాలీవుడ్ స్థాయి లో ప్లాన్ చేశారంటూ సెట్‌లోనే చర్చలున్నాయి.
ఈ సినిమా ఆలస్యంగా రూపొందినప్పటికీ , ఇప్పుడు ఫైనల్‌గా జూలై 31న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ హంగామా మొదలైంది . ప్రస్తుత టాలీవుడ్ మార్కెట్‌ను చూస్తే, "కింగ్డమ్" మంచి ఓపెనింగ్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి .. విజయ్ దేవరకొండకు ఇది చాలా కీలకమైన సినిమా. గతంలో కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో పనితీరు చూపలేకపోయాయి . అయితే "కింగ్డమ్" మాత్రం పూర్తి మాస్ మరియు కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ఉండటంతో విజయ్ కు తిరుగులేని రీ-ఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు