తెలుగు సినీ పరిశ్రమలో సినిమాటో గ్రాఫర్ గా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో సెంథిల్ కుమార్ ఒకరు. ఈయన ఎక్కువ శాతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమాలకు సినిమాటో గ్రాఫర్ గా పని చేసి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన జూనియర్ అనే సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా  వ్యవహరించాడు. ఈ మూవీ లో ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు వ్యాపార వేత్త అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరో గా నటించాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... రాధ కృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

వారాహి చలనచిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ ని జులై 18 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఇప్పటికే విడుదల చేశారు. అందులో కొన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమాటో గ్రాఫర్ అయినటువంటి సెందిల్ కుమార్ తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

అందులో భాగంగా ఆర్ ఆర్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత జూనియర్ మూవీ కి ఎందుకు సినిమాటో గ్రాఫర్ గా పని చేశాను అనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చాడు. తాజాగా సెంథిల్ కుమార్ మాట్లాడుతూ ... నిర్మాత సాయి గారితో నేను ఈగ సినిమా చేశాను. ఆయనతో నాకు మంచి స్నేహ బంధం ఉంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా గురించి ఆయన నాకు చెప్పారు. రాధ కృష్ణ నాకు కథను వినిపించారు. ఆ కథ అద్భుతంగా నచ్చడంతో నేను ఈ సినిమాకు ఒప్పుకున్నాను అని సెందిల్ కుమార్ తాజాగా పాత్రికేయుల సమావేశంలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: