
తన 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో కొటా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, మిక్స్డ్ పాత్రలల్లో ఎన్నో విలక్షణ రోల్స్ చేసి మెప్పించారు. మొత్తంగా ఆయన కెరియర్ లో తొమ్మిది నది పురస్కారాలు అందుకున్నాడు. ఆయనను 2015లో అందరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. కోటా సినీ జీవితం అందరికి ఓ ఇన్స్పిరేషన్. బ్యాంక్ ఉద్యోగం వదులుకుని నాటకాలు వేసుకుంటూ..సినీ అవకాశాలు అందుకుంటూ ఇప్పుడు కోట్లాది మంది మనసులను గెలుచుకునే స్ధాయికి వెళ్లిపోయాడు.
కాగా కోటా శ్రీనివాసరావు గారికి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాలలో ఆయన గొంతును వినిపించారు . అంతేకాదు పాటలు కూడా పాడి మెప్పించారు . ముఖ్యంగా అక్కినేని అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సిసింద్రీ సినిమాలో "హలో బాసు" అంటే సాగే సాంగ్ సింగర్స్ మను, మురళీధర్ తో కలిసి పాడి మెప్పించారు . ఆ టైంలో ఈ పాట మంచి హిట్ అయింది . కోట శ్రీనివాసరావుకి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో "మందు బాబులం" అనే పాట పాడి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు . డబ్బింగ్ ఆర్టిస్ట్ గా భారతీయుడు , ప్రేమికుల రోజు, జెంటిల్మెన్ , ప్రియురాలు పిలిచింది , ఒకే ఒక్కడు ,నరసింహ శివాజీ లలో గౌండమని, మణ్ణివనన్ లకి డబ్బింగ్ కూడా చెప్పారు..!!