
కన్నడ మీడియా లో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పేరు "రామన్న" అంటూ ఫిక్స్ చేశారట. "రామ్" పేరు ఆయనకి ఎంత ఇష్టమో..ఎంత సెంటిమెంట్ అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఆయన కొడుకు పేరు "అభయ్ రామ్" ..ఇంకో కొడుకు పేరు "భార్గవ్ రామ్" . రామ్ అంటే ఆయనకి ఒక సెంటిమెంట్ . ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కి ఆ పేరు చూస్ చేసుకోవడం చాలా హైలెట్ గా మారింది. "డ్రాగన్" సినిమాలో ఎన్టీఆర్ కి ఈ పేరు పెట్టడంతో ప్రశాంత నీల్ - జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఉన్న అనుబంధం సంబంధం ఇంకా హైలైట్ గా మారింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని మనం ఎప్పుడు చూడని లుక్స్ లో చూడబోతున్నాం. ఊర మాస్ నాటు లుక్ లో చూడబోతున్నాము అంటూ తెలుస్తుంది. డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని సెంటిమెంట్ తో హిట్ కొట్టేలా చేస్తున్నాడు అంటూ కూడా సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు . సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ ..ఏ డైరెక్టర్ తో తన పరసనల్ షేర్ చేసుకోరు . కానీ ప్రశాంత్ నీల్ తో మాత్రం అన్ని విషయాలు షేర్ చేసుకోవడం అందరి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఆయన ప్రశాంత్ నీల్ ని ఎంత నమ్మాడు అనేది కూడా ఈ విషయంలో చెప్పేయచ్చు..!!