
ది రాజాసాబ్ మూవీ సౌత్ హక్కులు 170 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని నార్త్ హక్కులతో కలిపితే నాన్ థియేట్రికల్ డిజిటల్ హక్కుల ద్వారానే ఈ సినిమాకు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా శాటిలైట్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.
ది రాజాసాబ్ మూవీ బడ్జెట్ 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది. నిర్మాతలకు భారీ లాభాలు ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. మారుతి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ది రాజాసాబ్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ది రాజాసాబ్ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సైతం 200 కోట్ల రూపాయలకు పైగా ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృస్తిస్తుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ ను అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ సినిమాలో ట్విస్టులు ఒకింత ఆసక్తికరంగా ఉన్నాయనే చెప్పాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు