ఏంటి ప్రభాస్ ఇంట్లో కోటి రూపాయల విలువ చేసే చెట్టు నాటారా.. ఇంతకీ ఆ చెట్టుకి కోటి రూపాయల ఖరీదు పెట్టడానికి కారణం ఏంటి.. కోటి రూపాయల కాస్ట్ చేసే ఆ చెట్టుకి ఉన్న ప్రత్యేకతలు ఏంటి..ఎందుకు అంత ఖరీదు చేసి ప్రభాస్ ఆ చెట్టును కొనుగోలు చేశారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.. రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ అంటే ఓ బ్రాండ్ గా మారిపోయింది.తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొట్ట మొదటి పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాదులో ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్నారు.అయితే ఇప్పటికే ఆయనకు ఇల్లు, ఫామ్ హౌస్ లు ఉన్నప్పటికీ స్పెషల్ గా మళ్లీ మరో ఇల్లు కట్టించుకుంటున్నారట.

అంతేకాదు ఆ ఇంట్లో దాదాపు కోటి విలువ చేసే ఒక చెట్టును కూడా పెట్టించుకున్నారట. మరి ఇంతకీ కోటి విలువ చేసే ఆ చెట్టు పేరు ఏంటయ్యా అంటే కల్ప వృక్షం.. కల్పవృక్షం అనగానే అందరికీ అర్థమవుతుంది.పురాణాల ప్రకారం కల్పవృక్షాన్ని సంతానం,శాంతి,సంపద వంటి వాటిని కోరితే ఇచ్చే వృక్షంగా చెప్పుకుంటారు. అంతేకాదు ఈ కల్పవృక్షం దేవతల వనంలో ఉంటుంది అని అంటూ ఉంటారు. అయితే అలాంటి మహిమగల ఈ కల్పవృక్షాన్ని ప్రభాస్ ఏకంగా తన ఇంట్లోనే పెట్టించుకున్నారట.అయితే ఆ కల్ప వృక్షానికి అన్ని పవర్స్ ఉన్నాయంటే కచ్చితంగా దానికి రేటు కూడా అదే రేంజ్ లో ఉంటుంది కదా.. అయితే ఈ కల్ప వృక్షానికి వయసును బట్టి రేటు ఉంటుందట.ఈ కల్పవృక్షం ఎన్ని సంవత్సరాల వయసు పెద్దదైతే అంత ఎక్కువ రేటు పలుకుతుందట. 

అలా ప్రభాస్ కొన్న కల్పవృక్షం వయసు దాదాపు 100 సంవత్సరాలు ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఆ కల్పవృక్షాన్ని కోటి రూపాయలు పెట్టి కొన్నారట. అయితే ఇంత ఖరీదైన కల్పవృక్షం ఒకటి అంబానీ ఇంట్లో ఉంటే మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ ఇంట్లో ఉందని పలువురు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ప్రభాస్ కల్పవృక్షానికి సంబంధించిన మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ కి ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఉన్నాయా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఈ కల్పవృక్షం ఏదో ఇంటికి అందాన్ని ఇస్తుందని మాత్రం పెట్టుకోలేదట.ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు శుభం జరుగుతుందనే నమ్మకం.అలాగే ఈ కల్ప వృక్షాన్ని ఎక్కువగా పూజా కార్యక్రమాలలో వాడుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: