బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తాజాగా తీవ్ర గాయాలపాలైనట్టు జాతీయ మీడియా పేర్కొంది.. నెల రోజులపాటు హాస్పిటల్ లో ఉండాల్సిందే అని వైద్యులు తేల్చి చెప్పారట. మరి ఇంతకీ షారుక్ ఖాన్ కి అంత తీవ్రగాయాలు అయ్యాయా.. నెల రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు ఎందుకు చెప్పారు..ఇంతకీ ఆయనకు ఏమైంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.బాలీవుడ్ బాద్ షా గా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీని కాపాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకానొక సమయంలో బాలీవుడ్ లో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతూ ఇండస్ట్రీ పరువు మొత్తం తీసేస్తున్న తరుణంలో దాదాపు 2000 కోట్ల కొల్లగొట్టిన సినిమాలు ఒకే సంవత్సరంలో చేసి బాలీవుడ్ ని కాపాడారు. 

అయితే అలాంటి బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తాజాగా తీవ్ర గాయాల పాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్ ఖాన్ కింగ్ మూవీ షూటింగ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ షూటింగ్ లో  భాగంగా షారుఖ్ ఖాన్ స్టంట్స్ చేస్తున్న టైంలో సడన్  ప్రమాదం జరిగి షారుఖ్ ఖాన్ కి తీవ్ర గాయాలు అయ్యాయట.అయితే తీవ్ర గాయాలైన షారుఖ్ ఖాన్ ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళగా యూఎస్ తీసుకెళ్ళమని డాక్టర్లు తేల్చి చెప్పారట.దాంతో చేసేదేమీ లేక షారుఖ్ ఖాన్ ని చికిత్స నిమిత్తం యూఎస్ కు తరలించారట.అయితే యూఎస్ లో షారుఖ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసిన డాక్టర్లు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదని, గాయాల తీవ్రత తక్కువేనని తేల్చి చెప్పారు.

అలాగే మల్టిపుల్ మజిల్ ఇంజ్యూరీ అయ్యి దాదాపు నెలరోజులపాటు షూటింగులు వంటివి వాయిదా వేసుకొని ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని చెప్పారట. అలా డాక్టర్ మాటలతో షారుక్ ఖాన్ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో వైరల్ గా మారడంతో చాలామంది షారుఖ్ ఖాన్ అభిమానులు అయోమయంలో మునిగిపోయారు.కానీ షారుఖ్ ఖాన్ ఆరోగ్యం బాగానే ఉందని, కానీ నెల రోజులపాటు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా కోలుకుంటారని చెప్పడంతో అభిమానులు కూడా హమ్మయ్యా అంటూ ఊపిరి పిలుచుకుంటున్నారు.ఇక షారుక్ ఖాన్ నటించిన కింగ్ మూవీ ఆయనకు ప్రమాదం జరగడంతో వాయిదా పడింది. మళ్ళీ ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లేదా నవంబర్లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక షారుఖ్ ఖాన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు అందరూ దేవున్ని ప్రార్థిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: