జాన్వీ క‌పూర్‌.. బాలీవుడ్ లో ఈ బ్యూటీ కి స్టార్ కిడ్ అన్న క్రేజ్ తప్ప ఇంతవరకు ఒక్క సరైన హిట్టు కూడా పడలేదు. అలాంటి జాన్వీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం చెలరేగిపోతోంది. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. గత ఏడాది `దేవర పార్ట్ 1` తో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి సినిమా అయినప్పటికీ శ్రీదేవి కూతురు అన్న ఇమేజ్ ఉండడంతో దేవర కోసం జాన్వీ రూ. 5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుందన్న వార్తలు వచ్చాయి.


ప్రస్తుతం తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో `పెద్ది` సినిమా చేస్తోంది. ఇదొక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అయితే దేవర హిట్ కావడంతో పెద్ది సినిమాకు జానీ కపుర్ ఏకంగా రూ. 6 కోట్లు పారితోషికం అందుకుంటుందని ఇండస్ట్రీ వ‌ర్గాల్లో ప్రచారం జరుగుతుంది.


ఇకపోతే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ సినిమాలోనూ ఒక హీరోయిన్ గా జాన్వీ క‌పూర్ ను అనుకుంటున్నారు. ఆమెతో సాంప్రదింపులు కూడా ప్రారంభించారట‌. కానీ ఆమె డిమాండ్ చూసి నిర్మాత‌లు షాకైపోయార‌ట‌. అల్లు అర్జున్‌ మూవీకి మరో కోటి పెంచి ఏడు కోట్ల రూపాయిలు జాన్వీ డిమాండ్ చేసిందట‌. దాంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారని ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది. ఏదేమైనా కెరీర్ ఆరంభంలోనే సినిమా సినిమాకు జాన్వీ ఇలా రెమ్యున‌రేష‌న్ ను పెంచుకుంటూ పోతే దెబ్బ ప‌డ‌టం ఖాయ‌మ‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: