
జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కార్తికేయ స్వామి కథాంశంతో తెరకెక్కనుందని ఈ సినిమా బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ సినిమా ఒకటా కాదా అనే విషయం తనకు తెలియదని ఆయన అన్నారు. కొంతకాలము క్రితం విడుదలై సక్సెస్ సాధించిన ఒక సినిమా ఎలా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో తమకు కూడా అర్థం కాలేదని ఆయన చెప్పుకొచ్చారు.
మ్యాడ్ స్క్వేర్ సినిమా అన్నిఏరియాల్లో లాభాలను సొంతం చేసుకునని ఆయన కామెంట్లు చేశారు. కింగ్డమ్ సినిమా బడ్జెట్ ఏకంగా 130 కోట్ల రూపాయలు అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా వాయిదా పడినప్పటికీ నెట్ ఫ్లిక్స్ నుంచి తమకు సపోర్ట్ దక్కిందని ఆయన వెల్లడించారు. వెబ్ సైట్లలో సినిమా గురించి పాజిటివ్ గా రాయించడానికి కూడా భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్న పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు.
సినిమా కోసం టికెటింగ్ యాప్స్, వెబ్ సైట్స్ లో రేటింగ్స్ కొనుగోలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తామని అయితే ఏ సినిమా ముందు ఏ సినిమా తర్వాత అనే ప్రశ్నకు మాత్రం సమాధానం తెలియదని నాగవంశీ స్పష్టత ఇచ్చారు. భవిష్యత్తులో ఏపీలో భారీ స్థాయిలో సింగిల్ స్క్రీన్ నిర్మిస్తానని ఆయన కామెంట్లు చేశారు.