
తాజాగా పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" ఫ్లెక్సీస్ పెద్ద తలనొప్పి క్రియేట్ చేసినట్లయింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ రచ్చకెక్కింది . ఈ మధ్యకాలంలో ఈ ఫ్లెక్సీలు చాలా తలనొప్పులు క్రియేట్ చేస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా "హరిహర వీరమల్లు" మూవీ ఫ్లెక్సీలను తొలగించారు మునిసిపల్ సిబ్బంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటోలతో హరిహర వీరమల్లు ఫ్లెక్సీలు ఒంగోలులో ఏర్పాటు చేశారు ఆయన ఫ్యాన్స్. బాలినేని ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మునిసిపల్ సిబ్బంది తొలగించేసింది.
ఫ్లెక్సీలు తొలగింపును బాలినేని అనుచరులు తప్పుపట్టారు . అంతేకాదు వెంటనే మున్సిపల్ అధికారులు అనుమతి తీసుకొని అక్కడ మళ్లీ ఫ్లెక్సీలను అమర్చారు. దీనితో ఈ వివాదం సద్దుమణిగింది. తిరిగి ఫ్లెక్సీలను బాలినేని అనుచరులు యధా స్థానంలో ఏర్పాటు చేయడంతో పరిస్థితి మొత్తం కూల్ అయిపోయింది . కాగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం వైసిపికి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి అందరికీ తెలుసు. మంగళగిరిలోనే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బాలినేనికి పార్టీ కండువా కప్పి మరి జనసేనలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్.
బాలినేని జనసేనలో చేరికను గత కొంతకాలంగా టిడిపి - జనసేన క్యాడర్ వ్యతిరేకిస్తూనే వస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" సినిమా జులై 24న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే బాలినేని ఆయన ఫోటోలతో వీరమల్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొంతమంది కావాలనే ఆ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. అయితే బాలినేని అనుచరులు మున్సిపల్ అధికారుల అనుమతితో తిరిగి యధా స్థానంలో ఆ ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశారు. దీంతో పరిస్థితి మొత్తం కూల్ అయిపోయింది . ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అంటూ ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు..!!