ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కానీ అందరిలోకి చాలా క్యూట్ రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకుంది మాత్రం నమ్రత శిరోద్కర్ - మహేష్ బాబుల జంట అనే చెప్పాలి . వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ పెళ్లి సమయంలో జరిగిన గొడవలు అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఒక హీరోయిన్ ని ఇంటి కోడలుగా తెచ్చుకోకూడదు అని సూపర్ స్టార్ కృష్ణ భావించాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అసలు నమ్రత అంటే సూపర్ స్టార్ కృష్ణకు ఇష్టమే లేదట .

కానీ మహేష్ బాబు కోసమే కోడలుగా యాక్సెప్ట్ చేశారట . వీళ్ళ పెళ్లికి సూపర్ స్టార్ కృష్ణ అస్సలు ఒప్పుకోలేదట . కానీ మహేష్ బాబు మాత్రం చేసుకుంటే పెళ్లి నేను నమ్రతనే చేసుకుంటాను అంటూ భీష్మించుకుని  కూర్చోవడం ..మొండి  పట్టుదలగా ఉండడంతో ఒక మెట్టు దిగి కృష్ణనే వీళ్ల పెళ్ళికి అంగీకారం తెలిపారట.  అప్పటికే మహేష్ బాబు ఇంట్లో చెప్పకుండా కూడా పెళ్లి చేసుకోవాలి అంటూ అనుకున్నాడు అని అప్పట్లో వార్తలు వినిపించాయి. కాగా ప్రజెంట్ మహేష్ బాబు - రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.

నమ్రత మాత్రం సినిమాలకు దూరమైంది . పెళ్లి తర్వాత భర్త నే తన ప్రపంచం అంటూ పిల్లలే తన భవిష్యత్తు అంటే బ్రతుకుతుంది . కాగా నమ్రత - మహేష్ బాబుని ఎంత ప్రేమిస్తుందో ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో అందరికీ తెలుసు .వీళ్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి . కాగా ఇలాంటి మూమెంట్లోనే  నమ్రత అసలు మహేష్ బాబుని ఏమని పిలుస్తుంది ..? ఏవండీ , శ్రీవారు , మహేష్ బాబు లేక ఏదైనా పెట్ నేమ్ తో నా..? ఎలా పిలుస్తుంది అనే విషయాలు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు అభిమానులు .

సాధారణంగా సెలబ్రిటీస్ పెట్ నేమ్స్ తోనే పిలుచుకుంటారు. నమ్రత కూడా మహేష్ బాబును పెట్ నేమ్ తోనే పిలుస్తుందట.  అందరి ముందు "మహి" అని పిలుస్తుందట.  అంతేకాదు ఎవరూ లేకుండా వాళ్ళిద్దరే ఉన్నప్పుడు మాత్రం రకరకాల ముద్దు పేర్లుతో పిలుచుకుంటూ ఉంటారట.  మరి ముఖ్యంగా "కన్నా" అని పిలవడం నమ్రతకి చాలా చాలా ఇష్టమట. మహేష్ బాబు కూడా అలా పిలిస్తే చాలా సిగ్గుపడిపోతూ నవ్వేస్తూ ఉంటాడట.  సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: