
స్టోరీ:
ఔరంగజేబు(బాబీ డియోల్ )నుంచి కోహినూరు వజ్రాన్ని దొంగలించాల్సిన బాధ్యత వీరమల్లు (పవన్ కళ్యాణ్) కొన్ని కారణాల చేత తీసుకుంటారు. వీటికి తోడు ఇండియాను తన ఆధీనంలో పెట్టుకొని ఔరంగజేబు తమ మతంలోకి మారని వాళ్ళని చాలా హింసిస్తూ ఉంటారు.. వజ్రాన్ని విడిపించడానికి, భారతీయులను రక్షించడానికి ఔరంగజేబుతో వీరమల్లుకి ఎదురైన సవాళ్లు ఏంటి..? ఈ బాధ్యతలు అప్పగించిన కుతుబ్ షా ఎవరు అనేదే సినిమా స్టోరీ.
సినిమా కోసం పవన్ కళ్యాణ్ పడ్డ కష్టం తెరపైన స్పష్టంగా కనిపిస్తోంది.. ఇందులో పవన్ యాక్షన్స్ సన్నివేశాలు కూడా హైలెట్ గా ఉన్నాయి.. కీరవాణి బిజిఎం, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నిధి అగర్వాల్ పాత్ర తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది. ఔరంగజేబుగా బాబీ డియోల్ అద్భుతమైన నటనను కనబరిచారు. విఎఫ్ఎక్స్ సరిగ్గా లేకపోవడం, ఇందులోని పాత్రలకు లిప్ సింక్ సరిగ్గా లేకపోవడంతో పాటుగా క్లైమాక్స్ సరిగ్గా లేదని ఆడియన్స్ తెలియజేస్తున్నారు.
కథ పరంగా చూసుకుంటే కొత్తగా ఉన్నప్పటికీ డైరెక్టర్ క్రిష్ తీసిన వరకు సినిమా బాగుందని, డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తీసిన మిగిలిన భాగం పెద్దగా ఆకట్టుకోలేకపోతోందని పవన్ కళ్యాణ్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేక తడబడ్డాడు అన్నట్లుగా నేటిజన్స్ తెలియజేస్తున్నారు. హరిహర వీరమల్లులో హిందూ ధర్మ పరిరక్షణ సంబంధించి ఎక్కువగా చూపించారు. అలాగే సనాతన ధర్మం వంటి అంశాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. మరి కలెక్షన్స్ ఏ విధంగా రాపడుతుందో చూడాలి.
రేటింగ్ 2.75/5.0