టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఒక సూప‌ర్‌ హిట్ ప‌డి చాలా కాలమే అయిపోయింది. అయితే ఈసారి కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని క‌సి మీద ఉన్న విజయ్ `కింగ్‌డ‌మ్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. గౌత‌మ్‌ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ కాగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.


ఇప్ప‌టికే పలుమార్లు వాయిదా ప‌డిన కింగ్‌డ‌మ్‌.. ఎట్ట‌కేల‌కు జూలై 31న విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. మ‌రోవైపు థియేట్రిక‌ల్, నాన్‌-థియేట్రిక‌ల్ బిజినెస్ కూడా భారీగా జ‌రుగుతోంది. తాజాగా కింగ్‌డ‌మ్ ఓటీటీ రైట్స్ రికార్డు ధ‌రకు అమ్ముడుపోయిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్ ను ద‌క్కించుకుంద‌ట‌. అందుకోసం ఏకంగా రూ. 53 కోట్లు విచ్చించిన‌ట్లు బ‌లంగా టాక్ న‌డుస్తోంది.


ఇదే నిజ‌మైతే.. విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ లో అదే హైయెస్ట్ ఓటీటీ డీల్ అవుతుంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. కాగా, విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడ‌లేదు. `లైగ‌ర్` దారుణ‌మైన డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన `ఖుషి` జ‌స్ట్ యావ‌రేజ్ అనిపించుకుంది. పోయినేడాది వ‌చ్చిన `ది ఫ్యామిలీ స్టార్‌` బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డింది. అయిన‌ప్ప‌టికీ కింగ్‌డ‌మ్ అదిరిపోయే రేంజ్‌లో బిజినెస్ ను సొంతం చేసుకుంటోంది. ఈ లెక్క‌న విజ‌య్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అర్థం చేసుకోవ‌చ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: