టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న `కింగ్‌డ‌మ్‌` విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. విలక్షణ నటుడు సత్యదేవ్ విజయ్ కు అన్నయ్యగా కీలకపాత్రను పోషించాడు. జూలై 31న పాన్ ఇండియా స్థాయిలో కింగ్‌డ‌మ్ మూవీ విడుద‌ల కాబోతోంది.


ఈ నేపథ్యంలోనే శనివారం తిరుపతిలో సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఫుల్ ప్లాట్ ఎక్కడ చెప్పకుండా, ఎక్సైటింగ్ ట్రైలర్ కట్ రిలీజ్ చేసారు. యాక్షన్ మోడ్‌లో సాగిన‌ కింగ్‌డ‌మ్‌ ట్రైలర్ కు విశేషమైన స్పందన లభిస్తుంది. ఇద్ద‌రు అన్నదమ్ముల మధ్య సాగే గ్యాంగ్‌స్టార్‌ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్ల‌ర్ గా కింగ్‌డ‌మ్‌ మూవీ ఉండబోతుందని ట్రైలర్ తో స్పష్టమైనది. విజయ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, అనిరుధ్ అందించిన బీజీఎమ్‌, యాక్ష‌న్ సీక్వెన్స్ హైలెట్‌గా నిలిచాయి.


ట్రైలర్ చివర్లో `వీడు రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు` అనే డైలాగ్ విజ‌య్ క్యారెక్ట‌ర్ ను మ‌రింత ప్ర‌త్యేకంగా ఎలివేట్ చేస్తోంది. ట్రైల‌ర్ చూశాక కింగ్‌డ‌మ్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు కూడా అభిప్రాయ‌పడుతున్నారు. బొమ్మ ప‌క్కా హిట్.. విజ‌య్‌కు కంబ్యాక్ మూవీ అవుతుంద‌ని అంటున్నారు. అయితే కొంద‌రు కేజీఎఫ్‌, స‌లార్‌, పుష్ప సినిమాల‌ను మిక్స్ చేసిన‌ట్లు కింగ్‌డ‌మ్ ఉంద‌ని చెబుతున్నారు. కింగ్‌డ‌మ్ ట్రైల‌ర్ ఆయా చిత్రాల‌ను గుర్తు చేస్తున్నాయ‌ని కామెంట్లు పెడుతున్నారు. ఓవ‌రాల్‌గా చూసుకుంటే ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు తారా స్థాయిలో పెంచేసింది. మ‌రి ఆ అంచనాల‌ను విజ‌య్ అందుకుంటాడా? లేదా? అన్న‌ది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: