ఈ మధ్యకాలంలో సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ మరింత బోల్డ్ గా చూపిస్తున్నారు . పచ్చిగా నాలుగు గోడల మధ్య భార్యాభర్తలు చేసే పనులని బూతు అర్ధం వచ్చేలా చూపిస్తున్నారు. అందరు ఇలానే చూపిస్తున్నారు అని అనడం లేదు కొంతమంది మాత్రం హద్దులు మీరిపోయేలా రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు . గతంలో ఎంతో మంది స్టార్ డైరెక్టర్ లు రొమాంటిక్  సీన్స్ ఎంత నీట్ గా చూపించారు అనేది అందరికి తెలిసిందే. ఒకరు ఇబ్బంది పడకుండా థియేటర్స్ లో జనాలు చూసేటప్పుడు ఎక్కడ కూడా అసహ్యంగా ఫీల్ అవ్వకుండా ఉండేలా తెరకెక్కించారు . కానీ నేటి కాలం డైరెక్టర్స్ మాత్రం ఒక రొమాంటిక్ సీన్ ని మరింత దారుణంగా చూపిస్తున్నారు .


అతి జుగుప్సాకరంగా అసలు భార్యాభర్తలు కూడా అలాంటి సీన్స్ చూడలేని విధంగా తెరకెక్కిస్తున్నారు . ఇదే విషయాన్ని ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు.  దానికి కారణం "కిల్లర్: మూవీ . గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి అలియాస్ జ్యోతిరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమానే ఈ కిల్లర్ . శుక్ర , మాటేరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ సుకు పూర్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జ్యోతిరాయ్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు సుకుపూర్వ రాజ్ హీరోగా నటిస్తున్నాడు . ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన కొన్ని లుక్స్ , పోస్టర్స్ , గ్లింప్స్ సోషల్ మీడియాలో విశేష స్పందన లభించగా ..తాజాగా మరొక స్పెషల్ వీడియోని షేర్ చేశారు మేకర్స్.

 

ఇందులో జ్యోతిరాయ్ అలాగే ఫైట్ సీన్స్ రోబో సీన్స్ కూడా ఆకట్టుకునేలా చూపించారు . అయితే జ్యోతిరాయ్ ఇలా హద్దులు మీరిపోయిన సన్నివేశాలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కుర్రాళ్ళు . ఈ విధంగా రెచ్చకొడితే కుర్రాళ్ళు తప్పులు చేయరా..? అంటూ కొందరు కామెంట్స్ పెడుతుంటే.. ఇలాంటి సీన్స్ తెరకెక్కించి సభ్య సమాజానికి ఏం నిరూపించాలి అనుకుంటున్నారు అంటూ కొంతమంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.  కొంతమంది సీన్స్ చూసి పరమ ఛండాలం ఇంత పచ్చిగా ఎలా చూపిస్తారు రా నాయన.. తెరకెక్కించే వాళ్లకి తెరపై నటించే వాళ్ళకి ఇద్దరికీ సిగ్గులేదు అంటూ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో ట్రెండ్ అవుతుంది. కాగా సై-పై థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో విశాల్ రాజ్ , గౌతం కూడా హీరోలుగా యాక్ట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: