ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ప్రేమ‌లో మునిగి తేలుతున్నట్లు గత కొద్దిరోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై ఇంతవరకు అటు రాజ్ గానీ ఇటు సమంత గానీ స్పందించలేదు. అలా అని ఖండించనూ లేదు. పైగా ఇటీవ‌ల కాలంలో రాజ్ తో పదేపదే సమంత దర్శనమిస్తోంది.


తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడం, స‌మంత ప్రొడ్యూస్ చేసిన `శుభం` సక్సెస్ సెలబ్రేషన్‌లో రాజ్ భాగం కావ‌డం, ఇటీవ‌ల యూఎస్‌లోనూ స‌మంత, రాజ్ చాలా సన్నిహితంగా క‌నిపించ‌డం వంటి అంశాలు అంద‌రి అనుమానాల‌ను మ‌రింత బ‌ల‌ప‌రుస్తూ వ‌చ్చాయి. ఇక తాజాగా ఇద్ద‌రూ ఒకే కారులో క‌నిపించి అందరి దృష్టిని ఆక‌ర్షించారు.


స‌మంత, రాజ్ క‌లిసి ఓ రెస్టారెంట్‌కు డిన్న‌ర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇద్ద‌రూ ఒకే కారులో ఇళ్ల‌కు తిరిగెళ్తూ మీడియా కంట‌ప‌డ్డారు. ఇంకేముంది వారి ఫోటోల‌ను, వీడియోల‌ను క్లిక్‌మ‌నిపించారు. అవి కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా, `ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్ 2`, `సిటడెల్‌: హనీ బన్నీ` వంటి వెబ్ సిరీస్‌ల‌కు రాజ్ తో క‌లిసి స‌మంత వ‌ర్క్ చేసింది. అలా ఏర్ప‌డిన ప‌రిచ‌య‌మే ఇప్పుడు ప్రేమ‌గా మారింద‌ని గుసగుస‌లు వినిపిస్తున్నాయి. అయితే స‌మంతతో పాటు రాజ్‌కు కూడా ఇంత‌కుముందు ఒక వివాహం జ‌రిగింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: