
కల్కి 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా దిశా పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ప్రీమియర్ల ద్వారా 3.9 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ లో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలకమైన పాత్రలలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా 3.46 మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి.
బాహుబలి 2 : ప్రభాస్ హీరో గా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ప్రీమియర్ల ద్వారా 3 మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. రానా ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.
కూలీ : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా 2.9 మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించగా ... అమీర్ ఖాన్ చిన్న క్యామియో పాత్రలో నటించాడు. శృతి హాసన్ , ఉపేంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.
సలార్ పార్ట్ 1 : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా 2.6 మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి.