ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మూవీ ఫీవర్ ఉందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఓజీ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా  ఆ బిజినెస్ కు అనుగుణంగా కలెక్షన్లు కూడా వస్తాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఓజీక్రియేట్ చేసే రికార్డులు మాములుగా ఉండవని చెప్పవచ్చు. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

సినిమా హిట్టయితే ప్రియాంక అరుళ్ మోహన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలున్నాయి. ఓజీ సినిమా  తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇతర భాషల్లో కూడా తెలుగువర్షన్ బుకింగ్స్ బాగున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓజీ సినిమా  టాలీవుడ్ టాప్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఓజీ సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా 2 గంటల 34 నిమిషాల నిడివితో  ఈ సినిమా విడుదల కానుంది. ఓజీ  సినిమాలో పవన్ స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తున్నారు.  ఓజీ సినిమా సుజీత్ కెరీర్ కు కూడా కీలకమని చెప్పవచ్చు. దర్శకుడు సుజీత్ ఈ సినిమా కోసమే రెండు నుంచి మూడేళ్లు పరిమితమయ్యారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే స్టార్ హీరోలు సుజీత్ కు ఛాన్స్ ఇస్తారని చెప్పవచ్చు.

ఓజీ సినిమాకు ఫ్లాష్ బ్యాక్  సీన్లు హైలెట్ కానున్నాయని  తెలుస్తోంది.  ఓజీ సినిమాలో అకీరా నందన్ కనిపిస్తారా లేదా అనే చర్చ జరుగుతుండగా ఈ ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరికే అవకాశాలున్నాయి. ఓజీ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని  ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాహో సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా కలెక్షన్లను సాధించగా ఓజీ సినిమా  కూడా ఆ మ్యాజిక్ ను  రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

og