
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలకు ఉండే క్రేజ్ అంత ఇంతా కాదు. అయితే గత కొంతకాలంగా మెగా హీరోలకు ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కడం లేదనే సంగతి తెలిసిందే. అయితే మెగా హీరోలకు జపాన్ సెంటిమెంట్ కలిసొస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈ సినిమాలో మొదటి 20 నిమిషాలకు సంబంధించిన సన్నివేశాలకు జపాన్ కనెక్షన్ ఉంది.
ఈరోజు థియేటర్లలో విడుదలైన ఓజీ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా ఈ సినిమాకు కూడా జపాన్ కనెక్షన్ ఉందనే సంగతి తెలిసిందే. శుక్రవారం నాటికి ఓజీ సినిమా 70% అవుతుందని ఆదివారం సమయానికి డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో లాభాలు రావడం పక్కా అని తెలుస్తోంది. డైరెక్టర్ సుజిత్ కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమాతో దక్కిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఓజీ సినిమా ఇతర రాష్ట్రాల్లో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. ఓవర్సీస్ లో ఫుల్ రన్ లో ఈ సినిమా ఐదు మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. నిర్మాత దానయ్య చాలా లక్కీ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీగా లాభాలను సాధించడం పక్కా అని చెప్పవచ్చు.
ఓజీ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయలు కాగా నాన్ థియేట్రికల్ హక్కులతోనే ఈ మొత్తం రికవరీ అయిందని సమాచారం అందుతుంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఓజీ సినిమా టాక్ విషయంలో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ సమయంలో ఇతర సినిమాల నుంచి పెద్దగా పోటీ లేకపోవడం ఈ సినిమాకు కలిసి వచ్చింది. కాంతార చాప్టర్ 1 విడుదలైనా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓజీ హవా కొనసాగే అవకాశాలున్నాయి. ఇప్పట్లో మరో పెద్ద సినిమా లేకపోవడంతో ఓజి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం అయితే లేదు.