- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అతి ప్రతిష్టాత్మక సినిమా “అఖండ 2: తాండవం”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “అఖండ”తో ప్రేక్షకులలో అద్భుతమైన మాస్ కనెక్ట్ సాధించిన ఈ కాంబినేష‌న్ మరోసారి రిపీట్ అవుతుండ‌డంతో ఫ్యాన్స్ మాత్రమే కాకుండా న్యూట్రల్ ఆడియెన్స్‌లోనూ భారీ హైప్ నెలకొంది. ఈసారి సినిమా కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా, డివోషనల్ యాక్షన్ డ్రామాగా ఉంటుంద‌ని సమాచారం.


ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త ప్రధాన పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ సినిమా “భజరంగీ భాయిజాన్”లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్ర ఈ కథలో భావోద్వేగానికి ప్రాణం పోస్తుందని టీమ్ చెబుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. బోయపాటి తన మాస్ మేకింగ్ స్టైల్‌లో దేవీ అంశాలతో కలిపిన పవర్‌ఫుల్ ఎలిమెంట్స్ చూపించడంతో, ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.


లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, “ అఖండ 2 ” నైజాం రీజియన్‌లోనే భారీ బిజినెస్‌ సాధించింది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్ర హక్కులను దాదాపు రు. 36 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో బాలయ్య కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ థియేట్రికల్ బిజినెస్ అవుతుంది. ఈసారి కూడా బాలయ్య పవర్, బోయపాటి మాస్ టచ్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తున్నాయి.


టికెట్ రేట్లు సరిగ్గా నిర్ణయించి, టాక్ పాజిటివ్‌గా వస్తే “ అఖండ 2 ” బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టించడం ఖాయం. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందించగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. “అఖండ 2: తాండవం” ఈ డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: