యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “కె-ర్యాంప్” దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తన సొంత స్టైల్లో విభిన్న కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ వస్తున్న కిరణ్ ఈసారి కూడా కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపాయి. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం ఎనర్జీ, యూత్ కనెక్ట్ ఉన్న డైలాగులు, మ్యూజిక్ అన్నీ క‌లిసి సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డేలా చేశాయి.


సినిమా దీపావళి సీజన్‌లో పలు పెద్ద , మిడిల్ రేంజ్‌ సినిమాలతో పోటీగా థియేటర్లలోకి దిగబోతోంది. మొత్తం ఆరు సినిమాలు (మూడు తెలుగు, మూడు డబ్బింగ్) రిలీజ్ అవుతుండటంతో ఈసారి ఫెస్టివల్ సీజన్‌ బాక్సాఫీస్ బిజీగా మారనుంది. అయినా “కె-ర్యాంప్”పై మంచి కాన్ఫిడెన్స్‌తో టీమ్ ముందుకు వెళ్తోంది. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇండియా వైడ్‌గా దాదాపు రు. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగబోతోందట.


అంటే థియేట్రికల్ బిజినెస్‌ను రికవర్ చేసుకోవాలంటే సినిమా దాదాపు రు.16 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఈ టార్గెట్ పెద్దది కాకపోయినా, కంటెంట్ మరియు టాక్ మీదే ఈ సినిమా రిజ‌ల్ట్ ఆధారపడి ఉంటుంది. కంటెంట్ పాజిటివ్‌గా ఉంటే చిన్న సినిమాలు కూడా సక్సెస్ అవుతున్న ఈ కాలంలో “కె-ర్యాంప్”కి మంచి ఛాన్స్ ఉందని ట్రేడ్ టాక్. దీపావళి సెలవులు, ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్, మరియు కిరణ్ అబ్బవరం యూత్ ఫాలోయింగ్ క‌లిసి వ‌స్తే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కె ర్యాంప్ ఆడేస్తుందేమో ?  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: