టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో చాలా మంది చాలా స్లో గా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. కానీ నాని ఒక్కడు మాత్రం వీలు చిక్కితే సంవత్సరానికి రెండు సినిమాలు , లేదంటే కనీసం సంవత్సరానికి ఒక సినిమాను అయిన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఇలా నాని ప్రేక్షకుల ముందుకు కనీసం సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలను తీసుకువస్తూ ఉండడంతో నాని సీక్రెట్ ఏంటి అని ఎంతో మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. నాని కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... తాను ప్రతి సంవత్సరం వీలైతే రెండు సినిమాలు , లేదంటే కనీసం ఒక సినిమా అయిన ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో సక్సెస్ కావడానికి ప్రధాన కారణం నేను ఎప్పుడూ ఫలానా దర్శకుడితో ఖచ్చితంగా సినిమా చేయాలి అని ఎదురు చూస్తూ ఉండరు.

నా దగ్గరికి ఎవరైనా దర్శకుడు వచ్చి ఒక కథను వినిపించినట్లైతే ఆ కథ నాకు బాగా నచ్చి , అతను ఆ సినిమాను బాగా తీయగలడు అని నాకు అనిపిస్తే అతను కొత్త దర్శకుడు అయిన , ఆ దర్శకుడు వరుస ఫ్లాప్ లలో ఉన్న కూడా అతనితో సినిమా చేస్తాను. అందుకే నేను వరసగా సినిమాలు చేస్తున్నాను. సంవత్సరానికి వీలైతే రెండు సినిమాలు , లేదంటే కనీసం ఒక సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాను అని నాని చెప్పుకొచ్చాడు. ఇకపోతే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. గతంలో నాని , శ్రీకాంత్ కాంబోలో రూపొందిన దసరా సినిమా మంచి విజయం సాధించడంతో ది ప్యారడైజ్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. నాని మరి కొంత కాలంలోనే సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: