అల్లు అరవింద్ తెలిసి ఆ మాట అన్నాడో తెలియక ఆ మాట అన్నాడో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం దీన్ని ఇప్పుడు పెద్ద రాధాంతం చేసేస్తున్నారు కొంతమంది రష్మిక ఫ్యాన్స్,  రష్మిక  తాజాగా నటించిన సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది . ఈ సినిమా నవంబర్ 7వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది.  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గీత్ ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన "ది గర్ల్‌ఫ్రెండ్" సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టార్ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన్నా మరియు దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబర్ 7వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది.


ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో, అల్లు అరవింద్ రష్మిక మందన్నాను ప్రశంసిస్తూ.. “నాకు కూతుర్లు లేరు. రష్మిక ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. అయితే నాకు కూతురు అంటే రష్మికలా ఉంటే బాగుండేది” అని వ్యాఖ్యానించారు. అలాగే, ఆమెను తన కూతురుగా భావిస్తున్నట్టు కూడా చెప్పారు. ఈ మాటలు చాలా సరదాగా, జోవియల్ టోన్‌లో నే చెప్పారు అల్లు అరవింద్. కానీ  సోషల్ మీడియాలో రష్మిక ఫ్యాన్స్‌కి ఈ వ్యాఖ్యలు కొంత హర్టింగ్గా  అనిపించాయి. సోషల్ మీడియాలో, ఒక వర్గం ప్రేక్షకులు ఈ వ్యాఖ్యలను సెటైరికల్‌గా వర్ణిస్తూ.. గతంలో అనుపమ పరమేశ్వరణ్  గురించి అలాంటి మాటలు అన్నారనేలా కామెంట్ చేస్తున్నారు.

 

మరోవైపు, మరొక వర్గం మాత్రం గట్టిగా రియాక్ట్ అవుతున్నారు.  “పుష్ప, పుష్ప2 సిరీస్‌లో రష్మిక..నీ కొడుకుతో కలిసి ఎంత సూపర్ డూపర్ హిట్ సాధించిందో తెలుసు, మరి ఎందుకు అలాంటి కామెంట్స్? నీకు కూతురు అంటే అది అల్లు అర్జున్‌కు చెల్లిగా మారదా? వావి వరసలు మార్చేస్తున్నావా..?” అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో  అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సరదాగా చెప్పిన మాటలు, రష్మిక ఫ్యాన్స్‌ని తీవ్రంగా హర్ట్‌ చెసాయి. దీంతో సోషల్ మీడియాలో రచ్చహ్ రంబోలా చేసేస్తున్నారు ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: