ఈ చిత్రంలో ప్రభాస్ లుక్స్ పూర్తిగా కొత్తగా ఉండబోతున్నాయట. మనం ఇప్పటివరకు చూడని విధంగా ఉంటాయని కూడా మేకర్స్ వెల్లడించారు. ఇమాన్వి మరియు ప్రభాస్ మధ్య ఉన్న ట్రెడిషనల్ రొమాంటిక్ సీన్స్ ప్రతి ఒక్కరినీ హార్ట్-టచింగ్‌గా ప్రభావితం చేస్తాయని అంటున్నారు. అంతేకాదు డైరెక్టర్ పార్ట్ వన్ మరియు పార్ట్ 2 మధ్య 11 ప్రత్యేక కనెక్షన్‌లను కలిపి “మగధీర” స్టైల్‌లో సస్పెన్స్ సృష్టిస్తే, ఫ్యాన్స్‌కు ఇది నిజమైన డబుల్ ట్రీట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు తూతూ మంత్రం గా మాత్రమే రెండుసెగ్మెంట్లుగా మూవీలను తెరకెక్కిస్తున్నారు. వాటి మధ్య ప్రత్యేక లింక్ ఉండటం చాలా అరుదు. అయితే హను రాఘవపూడి ఈ సినిమాలో పూర్తిగా కొత్త, డిఫరెంట్ ప్లాన్ తో రూపొందిస్తున్నారట.
అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అంతేకాక, ఈ సినిమాకు చంద్రశేఖర్ క్లాసిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫైనల్‌గా, ప్రభాస్ ఫ్యాన్స్ కోసం “ఫౌజీ” నిజంగా డబుల్ ట్రీట్ అవుతుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా కేవలం ఒక హిట్ మాత్రమే కాకుండా, టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచే విధంగా రూపొందుతున్నది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి