అమెరికా దేశానికి తరలివెళ్లిన ఎన్నారైలకు అద్దె ఇళ్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సంపాదించే జీతంలో 50 శాతానికి పైగా అద్దింటికే చెల్లించాల్సి వస్తుంటే.. అక్కడి ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఇక అమెరికాలో ఉద్యోగం సంపాదించే అక్కడే స్థిరపడాలనుకునే వారి ఆశలపై అద్దింటి ఖర్చులు నీళ్లు చల్లుతున్నాయి. నిజానికి ప్రస్తుతం భారత పౌరులకే కాదు అమెరికా ప్రజలకు కూడా అద్దె ఇళ్లు దొరకడం లేదట.

కరోనా సమయంలో ఆర్థికంగా నష్టపోయిన చాలామంది తమ సొంత ఇళ్ల అద్దె ధరలను విపరీతంగా పెంచేశారు. అలాగే విదేశాల్లో నివసిస్తున్న చాలామంది అమెరికన్లు కరోనా సమయంలో తిరిగి సొంత ఇళ్లకు చేరుకున్నారు. దాంతో ఒక్కసారిగా అద్దె ఇళ్ల కరువు ఏర్పడింది. ఒక్క ఇంటి కోసమే దాదాపు నలుగురైదుగురు రెంట్ అప్లికేషన్లు పెట్టుకుంటున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అద్దె ఇళ్లలకు బాగా డిమాండు ఏర్పడడంతో.. వసతి దక్కించుకునేందుకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. కాలిఫోర్నియా, టంపా, ఫ్లోరిడా, టెన్నెస్సీ, రివర్ సైడ్ తదితర నగరాల్లో హౌజు రెంటు ధరలు భరించలేనటువంటి స్థాయికి చేరుకుంటున్నాయి.

గడిచిన మూడు నెలల వ్యవధిలోనే అమెరికాలోని 5 లక్షల అపార్ట్‌మెంట్లు జనంతో నిండిపోయాయి. 1993వ సంవత్సరం తర్వాత ఈ రేంజ్ లో అద్దె  అపార్ట్‌మెంట్లు బుక్ కావడం ఇదే మొదటిసారి. ఈ వివరాలను ఇండస్ట్రీ కన్‌సల్టెంట్ అనే ఒక సంస్థ వెల్లడించింది. జులై నెలలో దాదాపు 97% అద్దె ఇళ్లు నిండుకున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న యజమానులు అడ్డగోలుగా ధరలు పెంచేస్తూ ఎన్నారైలకు ఇతర దేశస్థులకు చుక్కలు చూపిస్తున్నారు. దాదాపు 18 శాతం మేర అద్దింటి ధరలు పెంచుతున్నప్పటికీ.. డిమాండ్ మాత్రం విపరీతంగా పెరుగుతోంది. అమెరికా ప్రజలే అష్టకష్టాలు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి ఎన్నారైల పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదిఏమైనా ఇకపై అమెరికా కి వెళ్లే ప్రజలు ముందస్తుగానే వసతి ఏర్పాట్లు రెడీ చేసుకోవడం అత్యవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: