ఇటీవలి కాలంలో ప్రపంచ దేశా లలో ఎంతలా డ్రగ్స్ మాఫియా రాజ్య మేలుతోంది ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఇలా డ్రగ్స్ మాఫియా కారణం గా  యువత మొత్తం పెడదారి పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా డ్రగ్స్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయడం అన్ని దేశాల ప్రభుత్వాలకు పెద్ద సవాలు గానే మారి పోయింది. ప్రపంచ దేశాలకు మత్తు నుంచి విముక్తి లభించేలా చేసేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసు కుంటున్నాయ్. ఇక ఇటీవల కాలం లో అయితే గంజాయి అక్రమ రవాణా కూడా అన్ని దేశాల్లో పెరిగి పోయింది అన్నది తెలిసిందే.


అయితే ఇలాంటి సమయం లో  తమ దేశాలను మత్తు నుండి బయటకు తీసుకు రావడానికి.. డ్రగ్స్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టాలను తీసుకు వస్తూ ఉంటే ఇక ఇటీవల థాయిలాండ్ ప్రభుత్వం మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా గంజాయి మొక్కలు పెంచడాన్ని లీగల్ చేస్తూ నిర్ణయం తీసు కోవడం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తం  గా సంచలనం గా మారి పోయింది. ఇక ప్రభుత్వం ఇలా గంజాయిని చట్టబద్ధం చేయడం తో అక్కడి దుకాణాలు, కేఫ్ లలో బహిరంగం గానే గంజాయి అమ్మడం అధికారికం గా మొదలు పెట్టారూ.



 అయితే ఇలా గంజాయిని చట్టబద్ధం చేసినప్పటికీ బహిరంగ ప్రదేశాల లో గంజాయి తాగడం ఏమాత్రం నిషేధించింది. వైద్య పరమైన ఉపయోగాలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశం లో 10 లక్షల గంజాయి మొక్కలు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. గతం లో గంజాయి కేసులో అరెస్టయిన 400 మంది విడుదల చేసేందుకు సిద్ధమైంది. అంతేకాదు ఇంటికొక గంజాయి మొక్క ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. థాయిలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: