ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలల్లో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కూడా నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో చిత్ర విచిత్రమైన ఘటనలు కూడా అటు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది వింతలకు విచిత్రాలకు చిరునామాగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చి.. నోరేళ్లపెట్టేలా చేస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే సాధారణంగా చిన్నపిల్లలు స్నేహితులతో దాగుడుమూతలు ఆడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక దాగుడుమూతలలో భాగంగా ఒక చిన్నారి మిగతా స్నేహితులు అందరూ కూడా ఎక్కడ దాక్కున్నారు అన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇక ఇలా స్నేహితులకు దొరకకుండా దాక్కోవడానికి  ప్రయత్నిస్తూ ఉంటారు మిగతా చిన్నారులు. ఇక ఇప్పుడైతే ఇలాంటి దాగుడుమూతలు కనిపించడం లేదు కానీ ఒకప్పుడు మాత్రం ఇలాంటి దాగుడుమూతలు ప్రతి ఒక్కరూ ఆడే ఉంటారు.


 ఇక్కడ ఒక 15 ఏళ్ల బాలుడు కూడా ఇలాగే దాగుడుమూతలు ఆడాడు. కానీ అందరిలా కాదు చాలా బాగా ఆడాడు. ఎంతలా అంటే ఏకంగా దాగుడుమూతలు ఆడుతూ దేశాన్ని దాటేశాడు. ఈ ఘటన బంగ్లాదేశ్ లోని చిట్టగంగులో వెలుగు చూసింది. స్నేహితులతో దాగుడుమూతలు ఆడుకుంటున్న ఆ బాలుడు ఓ కంటైనర్ లో దాక్కున్నాడు. కాసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. ఇక సిబ్బంది మాత్రం ఆ బాలుడిని గమనించలేదు. దీంతో కంటైనర్ ను లాక్ చేసి చివరికి మలేషియా తరలించారు. కాగా ఈనెల 17వ తేదీన మలేషియా పోర్టులో కంటైనర్ ఓపెన్ చేయడంతో విషయం బయటపడింది. అయితే ఇలా దాదాపు ఆరు రోజులపాటు ఆ బాలుడు ఆహారం నీరు లేకుండానే ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: