ఇంగ్లీష్ అనేది నేటి రోజుల్లో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. భారత్ లో ఎలా అయితే హిందీని జాతీయ భాషగా అభివర్ణిస్తూ ఉంటారో.. ఇక ఇంగ్లీషును అటు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ని కూడా ఎంతోమంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చింది అంటే చాలు ఇక ఏ దేశానికి వెళ్ళినా కూడా కమ్యూనికేషన్ చేయవచ్చు అని నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి. అందుకే ఇటీవల కాలంలో ప్రతి దేశంలో కూడా విద్యార్థులకు మాతృభాషతో పాటు ఇక ఇంగ్లీషులో కూడా పట్టు సాధించే విధంగా పాఠాలు బోధిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. మనదేశంలో అయితే ఇక ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రత్యేకంగా క్లాసులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు.



 ఇక నేటి రోజుల్లో ఇంగ్లీష్ బాగా నేర్చుకొని ఇక గుక్క తిప్పుకోకుండా మాట్లాడిన వారికి కాస్త అరుదైన గౌరవం కూడా దక్కుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో కొంతమంది అయితే ఏకంగా మాతృభాషను కూడా మర్చిపోయి ఇక ఇంగ్లీషులోనే కమ్యూనికేట్ చేస్తూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఇక అన్ని దేశాలు ఇలా  తమ దేశాల్లో చదువుకున్న విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటే ఇక్కడ ఒక దేశం మాత్రం ఇంగ్లీష్ భాష పై కఠిన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఇంగ్లీష్ పదాలను ఉపయోగిస్తే ఏకంగా 82 లక్షల రూపాయల జరిమానా  విధించేందుకు సిద్ధమయింది.



 ఇక ఇలా ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాస్త ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ ఆ దేశం ఏదో కాదు ఇటలీ. ఇటీవల ఇటలీ ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఏ ఇటాలియన్ అయినా సరే ఇతరులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు విదేశీ భాషా పదాలను ఉపయోగిస్తే 82 లక్షల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగం,వ్యాపార డాక్యుమెంట్లు, ఇక ఇతర అధికారిక పత్రాల్లో కూడా ఇంగ్లీష్ పదాలను వాడటం పై నిషేధం విధించింది ఇటలీ ప్రభుత్వం. ఇటలీలో కేవలం అటు ఇటాలియన్ నే ప్రథమ భాషగా వాడాలని.. కాదు కూడదు అనే నిబంధనలను అతిక్రమిస్తే నాలుగు లక్షల నుంచి 82 లక్షలు వరకు జరిమానా  తప్పదు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri