ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగిన కూడా ఎంతో ఈజీగా తెలుసుకోగలుగుతున్నారు నెటిజెన్స్. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ నివ్వరిపోతున్నారు అని చెప్పాలి. ఈ భూమి మీద ఇలాంటి మనుషులు కూడా బ్రతుకుతున్నారా అనే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సాధారణంగా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇక ఇంట్లో ఉన్న వారిని డోర్ ని తట్టడమో లేకపోతే బయట ఉన్న కాలింగ్ బెల్ ని కొట్టడమో లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఇది మనదేశంలోనే కాదు ఏ దేశంలోకి వెళ్ళినా సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ చేసేదే. కానీ ఇలా కాలింగ్ బెల్ కొట్టడమే ఇక్కడ ఒక యువకుడి ప్రాణం మీదికి తెచ్చింది అని చెప్పాలి. కాలింగ్ బెల్ కొట్టాడు అన్న కారణంతో ఒక వ్యక్తి కోపంలో ఏకంగా విచక్షణ రహితంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఇక కాలింగ్ బెల్ కొట్టిన పాపానికి యువకుడు ఆసుపత్రిలో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మనదేశంలో కాదులెండి గన్ కల్చర్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన అమెరికాలో వెలుగులోకి వచ్చింది. కాన్సాస్ కు చెందిన రాల్ఫ్ యార్ల అనే పదహారేళ్ళ యువకుడు నల్లజాతీయుడు. అయితే తన కవల సోదరులను తీసుకువెళ్లడానికి పొరపాటున వేరే ఇంటికి వెళ్లి డోర్ బెల్ రెండుసార్లు మోగించాడు.



 అయితే ఇక వెంటనే డోర్ తెరిచిన ఆ ఇంటి యజమాని ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు అని చెప్పాలి. ఇక తన వెంట తెచ్చుకున్న తుపాకీతో రాల్ఫ్ యార్ల్ పై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు అని చెప్పాలి. ఇక వెంటనే స్థానికులు అతని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇకపోతే నిందితుడు ఆండ్రు లెస్టర్ గా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే 24 గంటల తర్వాత అతని వదిలేయడం పై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్ అని చెప్పాలి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు అతని ఇంటి ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఘటనపై  ఏకంగా అమెరికా అధ్యక్షుడు బైడన్,  ఉపాధ్యాక్షరాలు కమల హరీష్ కూడా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri