ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని విషయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతమంది కీలక నాయకులను పార్టీ కోసం సిద్ధం చేసే విషయంలో చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన పార్టీ నాయకత్వం వ్యక్తం చేస్తోంది. కొంతమంది నాయకులు కొన్ని జిల్లాల్లో సైలెంట్ గా ఉండటం చికాకుగా మారింది. ఇదే ఇప్పుడు ఇబ్బందికరంగా మారిన అంశం. ప్రధానంగా విశాఖ జిల్లాలో కొంతమంది నాయకులు బయటకు రావడం లేదు.

అందులో గంటా శ్రీనివాసరావు అసలు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ కోసం పెద్దగా పని చేసే ప్రయత్నం చేయలేదు. అలాగే గుంటూరు జిల్లాలో కూడా కొంతమంది నాయకుల వైఖరి ఇబ్బందికరంగా మారింది. చాలా మంది నాయకులు పార్టీ వ్యవహారాల మీద కూడా పట్టు కోల్పోతున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా పార్టీని ముందుకు నడిపించాల్సిన తరుణంలో ఇబ్బందికరంగా వ్యవహరించడం ఎంతమాత్రం భావ్యం కాదు అనే భావన పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

కీలక నాయకత్వం అవసరమైన సమయంలో పార్టీ కోసం కష్టపడకపోతే కార్యకర్తల్లో నమ్మకం వచ్చే అవకాశాలు ఉండవు. కొంత మంది నాయకులను చంద్రబాబు నాయుడు లైట్ తీసుకున్నారని అంటున్నారు. ఇటీవలి కాలంలో బీజేపీతో కూడా కొంతమంది నాయకులు స్నేహం చేయడం ఆశ్చర్య కరంగా మారింది అని అంటున్నారు. అలాగే అధికార వైసీపీ నాయకులతో ఎప్పటి నుంచో స్నేహం చేస్తున్నవాళ్లను తనవైపుకు తిప్పుకుని పార్టీ విషయంలో సమర్ధవంతంగా వాడుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలకు కూడా చంద్రబాబు నాయుడు తీరుపై కోపం పెరుగుతుందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పర్యటనలు చేయడం లేదా అమరావతిలో మాత్రమే ఉండటం వంటివి పార్టీకి సమస్యగా మారాయి. కొన్ని కొన్ని విషయాల్లో దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే చంద్రబాబు వెళ్లడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: