మూడెకరాలు ఇవ్వలేదని ముఖ్యమంత్రి మాట్లాడారు.. మేనిఫెస్టోలో కూడా మూడెకరాలు ఇస్తా అని చెప్పాడు అని ఆరోపించారు తెలంగాణా బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు. అసెంబ్లీలో కూడా ప్రకటించారు అని ఆయన ప్రస్తావించారు. సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఎందుకు ఇవ్వకూడదో అన్న అంశాన్ని పరిశీలిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతి అంశం రికార్డు అయి ఉంటుంది.. మాటలు నీటి మూటలు కావు అని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోపై ప్రమాణం చేసి మూడెకరాలు ఇస్తా అని చెప్పలేదు అని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.

పోడు భూముల సమస్యపరిష్కారం కోసం గిర్ గిలానీ.. కోనేరు రంగారావు కమిటీ పై చర్చించేందుకు మీకున్న అభ్యంతరం ఏంటి అని నిలదీశారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం పోడుభూముల సమస్యలను ఎందుకు పరిష్కరించరు అని ఆయన ప్రశ్నించారు. జనాభా లెక్కల ప్రకారం మంత్రి పదవులు ఎందుకు ఇవ్వడం లేదు అని నిలదీశారు. అక్బరుద్దీన్ అడిగాడు అని కులగణన చేయమని అడిగినందుకు తీర్మానం చేసారు అని ఆయన నిలదీశారు. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడన్నట్టు ఉంది కేసీఆర్ పనితీరు అని ఆయన ఆరోపించారు.

దేశ అంశాలగురించి మీకెందుకు.. రాష్ట్రంలో రెడీ గా జన జనగణన  అనుగుణంగా లెక్కలు బయట పెట్టండి అని ఆయన డిమాండ్ చేసారు. అన్ని లెక్కలు మీవద్ద ఉంచుకుని హడావుడి ఎందుకు అని ప్రశ్నించారు. సుప్రీం కు అఫిడవిట్ ఇచ్చిన తరువాత.. కోర్టు లో ఉన్న అంశంపై తీర్మానం ఎలా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తీరు సుప్రీం కోర్టును తక్కువ చేసినట్లు కాదా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సుప్రీం కోర్టును ఇన్ఫ్లుఎన్స్ చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. మంత్రులకు కేంద్ర.. రాష్ట్ర నిదులు అంటూ వేరుగా తెల్వదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంటే ఎఫ్ఆర్బీఎం పెంచమని ఎందుకు అడుగుతున్నారు అని ప్రశ్నించారు. రంగారెడ్డి.. సంగారెడ్డి.. వికారాబాద్ జిల్లా లు తెలంగాణ కు 70శాతం ఆదాయం వస్తుంది అని బడ్జెట్ లో రాసారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: