ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన వైసిపి రెబల్ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు కు హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ కేసు విచారణ క్రమంలో ఎంపీ రఘురామ తో పాటు ఆయన లాయర్ పై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. మీ రాజకీయ వ్యక్తిగత ఖర్చులకు హైకోర్టును వేదికగా చేసుకుంటారా ? అని తీవ్రంగా మండి ప‌డింది. అసలు జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినా.. అందుకు ఒక కారణం అయినా స‌హేతుకంగా ఉందా ? అని ప్రశ్నించింది. మరోవైపు జగన్ సాక్షులను కూడా ప్రభావితం చేస్తున్నారని రఘురామ పిటిషన్లో పేర్కొన్నారు అని.. అయితే ఇందుకు మద్దతుగా కనీసం ఒక్క సాక్ష్యం అయినా చూపించారా అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎలాంటి సాక్ష్యాలు ... ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్షతోనే జగన్ బెయిల్ రద్దు చేయాలని ఈ పిటిష‌న్ వేసిన‌ట్టు ఉందని కూడా హైకోర్టు ఆక్షేపించింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్ కు బెయిల్ ఇచ్చాక ఎనిమిది సంవత్సరాలకు ఈ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ ఎందుకు ? వేసారని కూడా రఘురామ ను నిలదీసింది. జగన్ త‌ర‌పు న్యాయ‌వాది మాట్లాడుతూ జగన్ తో ఉన్న రాజకీయ వైరుధ్యం నేపథ్యంలోనే ఇప్పుడు ఎంపీ రఘురామ బెయిల్ ర‌ద్దు పిటిషన్ వేసినట్లు జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు.

ఇక ఇదే కేసును గతంలో విచారించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కూడా ఈ కేసును కొట్టివేసిన విషయాన్ని జగన్ తరఫు లాయర్ మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కావాల‌నే జగన్ కు వ్యతిరేకంగా ఈ కేసు వేసినట్టు కూడా జగన్ లాయ‌ర్ ఆరోపించారు. అయితే హైకోర్టు వేసిన పలు ప్రశ్నలకు ఎంపీ రఘురామ తరపున లాయర్ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో రఘురామ‌ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: