
ఈ చట్టం 18 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లల సంరక్షణ కోసం రూపొందించబడింది. అయితే ఈ చట్టాలను ఎన్ని రాష్ట్రాలు సక్రమంగా అమలు చేస్తున్నాయి అన్నది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రము ఆడపిల్లల రక్షణ మోసం ఒకడుగు ముందుకు వేసింది. ఇందుకోసం పోక్సో కోర్ట్ లను తీసుకువస్తోంది. ఎవరైతే అన్యాయం గా మృగాళ్ల బారిన పడి బాధలు పడుతున్నారో వారికీ న్యాయం చేయడానికి అవసరం అయినన్ని పోక్సో కోర్ట్ లను స్థాపించడానికి కేసీఆర్ సర్కారు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా గిరిజనులు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ మరియు జనగామ జిల్లాలలో ఈ రోజు పోక్సో కోర్ట్ లను స్టార్ట్ చేయనున్నారు.
ఈ కోర్ట్ లను తెలంగాణ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర వర్చ్యువల్ గా స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ కోర్ట్ ల ద్వారా అందరికీ న్యాయం చేకూర్చే దిశగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలను తీసుకుంటోంది. అయితే ఈ కేసులకు సంబంధించి బాలికల విషయాలను బహిర్గతం కాకుండా సీక్రెట్ గా ఉంచి విచారణ చేయనున్నారు.