బుడగ జంగాలు.. ఈ పేరు వినే ఉంటారు.. వినరా.. వినరా.. వీరకుమారా.. అని ఆలపిస్తూ.. తంబూరతో వినోదాన్నందించే వారు గ్రామాల్లో కనిపిస్తుంటారు..వారే వీరు. వీరు మహా భారతం, రామాయణం, తోలు బొమ్మలాట, బొబ్బిలి కథలు, భాగవతం, బుర్రకథలు చెబుతూ భిక్షాటన చేస్తుంటారు. ఒకచోట నివాసం ఏర్పరుచుకోవడం వీరికి తెలియదు.
సంచార జాతుల్లో భాగంగా ఉండేవారు బుడగ జంగాలు. వీరికి ఇప్పుడు ప్రభుత్వాల నుండి ఎలాంటి ఆదరణ లభించడం లేదు. కారణం వీళ్లు అత్యల్పంగా ఉండటమే. వీరికి గణనీయమైన ఓటు బ్యాంకు లేకపోవడం, రాజకీయాల్లోకి కనీసం అడుగుపెట్టకపోవడం, ముఖ్యంగా చెల్లచెదురుగా ఉన్న కులం ఒక గొడుగు కింద సంఘటితం కాకపోవడం లాంటి కారణాల రీత్యా బుడగ జంగాల వెనుకబాటుకుగురయ్యారు.
వీరికి కనీసం వ్యవసాయం చేసేందుకు భూముల్లేవు. స్థిర నివాసం లేకుండా సంచార జీవులుగా బతుకువెళ్లదీస్తున్నారు. ఒక గ్రామం నుండి మరో గ్రామం వెళుతుంటారు. తెలంగాణలో వీరి పరిస్థితి కొంత వరకూ నయం.. కానీ ఆంధ్రాలో పరిస్థితి దారుణం. ఎదుకంటే తెలంగాణలో వీరిని ఎస్సీలుగా పరిగణిస్తున్నారు.
ఆంధ్రాలో మాత్రం వీరిని అటు ఎస్సీలు గా కానీ.. ఇటు బీసీలుగా కానీ పరిగణనించడం లేదు. అసలు బుడగ జంగాలు ఏపీలో లేరని ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. దీంతో వీరికి ఎలాంటి కుల ద్రువీకరణ పత్రం కూడా ఇవ్వడం లేదు. దీంతో వీరికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఎలాంటి రిజర్వేషన్ దక్కడం లేదు.
తాజాగా వీరి సమస్య అసెంబ్లీలో చర్చకు వచ్చింది. బుడగ జంగాలు ఏ కులంలోనూ లేరని, తమను ఏదో ఒక కులంలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్ తెలిపారు. విభజన సమయంలో బుడగ జంగాలు తెలంగాణలో మాత్రమే ఉన్నారని భావించి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీల్లోంచి వారిని కేంద్రం తీసేసిందని తెలిపారు.
బుడగ జంగాలకు సంబంధించి ఏదో ఒక కులాన్ని కల్పించే అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ప్రస్తుతానికైతే వారికి ఏ కులం సర్టిఫికెట్ ఇవ్వడం లేదని చెప్పారు. గతంలో చంద్రబాబు గతంలో ప్రతి కులాన్ని ఎస్సీల్లో చేరుస్తాను ? బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చారు. కానీ అదేమీ వర్కవుట్ కాలేదు. మరి జగన్ హయాంలోనైనా వీరికి న్యాయం జరుగుతుందా..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి