కరోనా టెన్షన్ తో ప్రజా ప్రతినిధులు పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా రావడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు నేతలు. తప్పనిసరైతేనే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏమైనా పనులు ఉంటే ఫోన్లో కాంటాక్ట్ కావాలని నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు.

 

తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. కరోనా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు పర్యటనలు నిర్వహిస్తూ వచ్చారు. ఒక్కసారిగా ముగ్గురు ఎమ్మెల్యే లకు కరోనా పాజిటివ్ రావడంతో ప్రజా ప్రతినిధులు పర్యటనల విషయంలో ఆలోచనలో పడ్డారు. జనంలోకి వెళితే పదుల సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొనే పరిస్థితులు ఉంటున్నాయి. కరోనా తో ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలని అనుకున్నా అది పూర్తి స్థాయిలో అమలు కానీ పరిస్థితులు కనిపించాయి.

 

కరోనా తర్వాత మళ్ళీ కేసులు పెరుగుతుండడంతో ప్రజా ప్రతినిధులు అలర్ట్ అవుతున్నారు . వీలైనంత  వరకు పర్యటనలకు...క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు.   తమను నేరుగా కలిసే ప్రయత్నం చేయవద్దని కోరుతున్నారు కొందరు నేతలు. పనులు ఏమైనా ఉంటే ఫోన్లో సంప్రదించాలని కోరుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న పరిస్థితిలో ఎక్కువగా పబ్లిక్ లో మూవ్ మెంట్ అందరికి ఇబ్బంది అన్న ఆలోచనలో ఉన్నారు నేతలు. కరోనా సహాయ సంబంధిత కార్యక్రమలలో రూల్స్ పాటిస్తూ పాల్గొంటున్నారు ప్రజా ప్రతినిధులు.

 

రాష్ట్రంలో కరోనా కేసుల గణాంకాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మొదట్లో పర్యటనల వైపు మొగ్గు చూపిన నేతలు... ఇప్పడు వీలైనత వరకు దూరంగా ఉండే యోచనలో ఉన్నారు. మొత్తానికి ప్రజాప్రతినిధులు పర్యటనలంటే హడలి పోతున్నారు. ఎక్కడికి పోతే ఎక్కడ కరోనా అటాక్ చేస్తుందో అనే భయం వారిని వెంటాడుతోంది. అందుకే ఓన్ లీ ఫోన్ కాంటాక్ట్ అనే నిబంధనలు విధించుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: