దేవీపురం వైజాగ్ నగరానికి సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, అందమైన పల్లె ఎంతో శోభాయమానంగా ఉంటుంది. తొమ్మిది  కొండలు కళ్ళకు మనోహరంగా కనబడతాయి. వాటి మదన పచ్చని ప్రకృతి పరవశం కలిగిస్తుంది. ఈ ఆలయానికి మరో విశిష్టత ఉంది. అదేమిటంటే...? ఈ ఆలయం శ్రీ చక్ర యంత్రం ఆకృతిలో నిర్మింపబడింది. ఇటువంటి పెద్ద శ్రీ చక్ర ఆలయం ప్రపంచం లో ఎక్కడా లేక పోవడమే మరొక విశేషం. ఈ ఆలయం లో శ్రీ రాజ రాజేశ్వరి, శివుడు కొలువై ఉన్నారు. ఈ సహస్రాక్షి రాజ రాజేశ్వరి ఆలయం లో దసరా బ్రహ్మాండంగా జరుపుతారు.


ఇక్కడ దసరా బ్రహ్మోత్సవ కార్యక్రమముల విషయం లోకి వస్తే...... బహు ఘనంగా వేడుకల్ని జరుపుతారు. ప్రతీ ఏటా  వైవిధ్యభరితంగా అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ, రాజరాజేశ్వరి దేవి రూపాలలో అలంకరణ చేయడం తో పాటు ప్రధాన దేవతా హోమాలు జరుపుతారు. ఇలా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అనేక ప్రాంతాల నుండి భక్తులు, భవానీలు దర్శనానికి వస్తారు. శ్రీ చక్ర ఆలయంలో మూడో అంతస్తు లో అంటే బిందు స్థానంలో శయనించిన సదా శివుని మీద కూర్చునే అమ్మవారి నిలువెత్తు విగ్రహం బాగా ఆకట్టుకుంటుంది.

 దేవిపురం సహస్రాక్షి శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం విశాఖపట్నం కు అతి దగ్గర లో ఉన్న సబ్బవరం కి కేవలం ఐదు కిలో మీటర్ల దూరం లో ఈ ఆలయం ఉంది. ఇక్కడే సహస్రాక్షి పేరుతో శ్రీ రాజ రాజేశ్వరి దేవి ఆలయం వెలసింది.  అంతే కాదు ఈ ఆలయం లో  శక్తి పూజలు చేయడానికి కామాఖ్యా పీఠాన్ని నిర్మించారు. అలానే శివ పూజల కోసం కొండ మీద శివాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: