సాధారణంగా ప్రజలు ఎక్కువగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేందుకే   ఆసక్తి చూపుతుంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రైవేటు బస్సులో కంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం  ఎంతో సురక్షితమైనవి అని నమ్ముతూ  ఉంటారు. అంతే కాకుండా అతి తక్కువ ఖర్చు తో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇక్కడ ప్రయాణికులు ఇలాగే అనుకోని ప్రయాణం చేశారు కానీ అనుకోని సంఘటనతో ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గజగజ వణికిపోయారు. బస్సు నడుపుతున్న డ్రైవర్ ను చూడగానే గట్టిగా కేకలు వేసి భయంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.



 ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం స్టోరీలోకి వెళ్లాల్సిందే.. కర్నూలు జిల్లాలో ఇటీవల తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.  కర్నూలు జిల్లా ఆదోని బస్టాండ్ నుంచి ఉదయం 25 మంది ఆర్టిసి బస్సు మెలిగ నూరు కు బయలుదేరింది. మధ్యలో కుప్పగల్  సమీపంలోకి రాగానే బస్సు ఒక్కసారిగా పెద్ద కుదుపుకు గురైంది.  ఏం జరిగి ఉంటుందా అని కండక్టర్ లక్ష్మన్న డ్రైవర్ ను చూసేందుకు వెళ్ళాడు. ఇంతలో షాక్ ఎందుకంటే డ్రైవింగ్ సీట్లో ఉన్న బసయ్య  కుప్పకూలిపోవటం  గమనిస్తాడు.  దీంతో అప్రమత్తం అయిన కండక్టర్ లక్ష్మన్న గట్టిగా కేకలు వేసి డ్రైవర్ను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశాడు.



 అయితే బస్సులో ప్రయాణికులు ఉన్నారు అని గమనించిన బస్సు డ్రైవర్ ఇక వారి ప్రాణాలకు ఏం కాకూడదు అనే ఉద్దేశంతో ఎక్స్ లెటర్ పై నుంచి కాలు తీసి ఇక బ్రేక్ వేసాడు. దీంతో బస్సు కొంత దూరం వెళ్లి తర్వాత ఆగిపోయింది. అయితే డ్రైవర్ కుప్పకూలిపోయాడు బస్సు ప్రమాదంలో ఉంది అని గమనించిన ప్రయాణికులు గట్టిగా కేకలు వేస్తూ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని భయాందోళనకు గురయ్యారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండానే  ప్రమాదం తప్పింది. ఇక ఆ తర్వాత కండక్టర్ వెంటనే 108కు సమాచారం అందించి డ్రైవర్ ను  ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.  ఒక్కసారిగా బీపీ పెరగడం తోనే డ్రైవర్ అస్వస్థతకు గురైనట్లు  తెలిపిన డాక్టర్లు చికిత్స అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: