చివరికి ఎన్నో ఆరోగ్య సమస్యలు దరి చేరిన తర్వాత ఇక పెద్దలు చెప్పిన మాటలు బంగారూ మూటలు అని భావించి ఒకప్పుడు వారు చెప్పిన ఆహారపు అలవాట్లు ఫాలో అవుతూ మళ్ళీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవటానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు పెద్దలు సద్ది అన్నం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెబుతూ ఉండేవారు. కానీ నేటి కాలంలో కి వచ్చిన తర్వాత చద్దన్నం అంటే అందరూ చిరాకు పడతారు కానీ చివరికి పెద్దలు చెప్పిన సద్దన్నం ఒక స్టార్ హోటల్లో స్పెషల్ డిష్ గా పెట్టడం చూసాం..
ఇలా ఒకప్పుడు పెద్దలు మంచిది అని చెప్పినవే చివరికి నేటి జనరేషన్ లో కూడా ఫాలో అవుతున్నారు అయితే ఒకప్పుడు పెద్దలు గంజి తాగితే కూడా ఎంతో మంచిది అని చెబుతూ ఉండేవారు ఎంతమంది ఇలా గంజి తాగుతూనే జీవనం సాగించేవారు. అయితే ఇప్పుడు కూడా కొంతమంది ఇలాగనే తాగడానికి ఇష్టపడుతున్నారు.. గంజి తాగడం వల్ల అసలు ప్రయోజనాలు ఏమిటి అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఇక గంజి తాగడం వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. గంజి జ్వరం టైములో తాగితే డీహైడ్రేషన్ సమస్య ఉండదు.. అంతే కాదు గంజి మలబద్ధకాన్ని తగ్గించడంతోపాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇక గంజిని షాంపు పెట్టిన తర్వాత హెయిర్ కండీషనర్ గా వాడితే జుట్టు ఎంతో బలం గా మారిపోతుంది రాత్రి ముఖానికి రాసుకుని ఉదయం కడిగితే ఎంతో గ్లో కూడా వస్తుంది అంతే కాకుండా మొటిమలు ఏర్పరిచిన ఎర్రటి మచ్చలను కూడా తొలగించేందుకు ఉపయోగపడుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి