వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తుండాలంటే బీజేపీ, తెలుగుదేశంపార్టీలు తమ షరతులకు ఒప్పుకోవాల్సిందే అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మూడు ఆప్షన్లు ఇచ్చారు. నిజానికి ఇప్పటికే బీజేపి-జనసేనలు మిత్రపక్షాలన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా టీడీపీతో పాటు బీజేపీకి కూడా పవన్ ఆప్షన్ ఇచ్చారు. సరే ఈ ఆప్షన్లను రెండుపార్టీలు తీసిపారేశాయి. తీసిపారేయటమే కాకుండా ఏకంగా పవన్ కు వ్యతిరేకంగా దుమ్మెత్తిపోశాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మూడు ఆప్షన్లలో జనసేన ఒంటరిగా పోటీచేయటం కూడా ఉంది. తర్వాత జరిగిన బహిరంగసభలో జనసేన పొత్తు జనంతో మాత్రమే ఇంకెవరితో కాదు అంటు పెద్ద సినిమా డైలాగు ఒకటి వదిలారు. దీంతో అర్ధమవుతున్నదేమంటే జనసేన ఒంటరిపోటీకి రెడీ అయ్యిందని. మరలాంటపుడు వైసీపీతో పాటు టీడీపీ, బీజేపీ పార్టీలు కూడా ప్రత్యర్ధిపార్టీలేకదా. పవన్ దృష్టిలో ఇదే నిజమైతే మరి పవన్ తన టార్గెట్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డిపైన మాత్రమే ఎందుకు ఉంచుతున్నారు ?

ఐదేళ్ళు అడ్డదిడ్డంగా పరిపాలించిన చంద్రబాబునాయుడు, రాష్ట్రప్రయోజనాలను తుంగలో తొక్కుతున్న కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వాన్ని ఎందుకని పల్లెత్తు మాటకూడా అనటంలేదు. ఇక్కడే పవన్ క్రెడిబులిటి మీద జనాలకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. తప్పుంటే తప్పుచేసిన అందరినీ నిలదీయాలి, ప్రశ్నించాలి. అంతేకానీ చంద్రబాబు, మోడీని వదిలేసి కేవలం జగన్ పైన మాత్రమే ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే జనాలు అనుమానించరా ? అసలు తన చిత్తశుద్దిని ఎవరైనా ప్రశ్నిస్తే పవన్ ఏమని సమాధానం చెబుతారు ?

ఇక్కడే పవన్ కు క్రెడిబులిటిలేదని జనాలకు అర్ధమైపోతోంది. పవన్ చెప్పేదొకటి, చేసేదొకటని అందరికీ తెలిసిందే. పవన్ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతనుండదన్న విషయం చాలా సంవత్సరాలుగా అందరు చూస్తున్నదే. పవన్ టార్గెట్ అంతా జగన్ పై బురదచల్లటం తప్ప మరోటికాదన్నది వాస్తవం. మొత్తానికి చంద్రబాబు రాజకీయప్రయోజనాలను కాపాడేందుకు పవన్ చివరకు తన క్రెడిబులిటిని కూడా దెబ్బ తీసుకుంటుండటమే ఆశ్చర్యంగా ఉంది. పాపం చివరకు పవన్ ఏమైపోతాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: