
వాస్తవానికి గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొదట అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం అమెరికాకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. అనే కుమారుడు స్నాతకోత్సవం అమెరికాలోని నార్త్ కరోలీనా లో జరుగుతుంది. సిబిఐ కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని మరి అమెరికాకు ప్రయాణం అవుతున్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈనెల 22వ తేదీన హైదరాబాద్ తిరిగి వస్తారు కల్వకుంట్ల కవిత.
కవిత తెలంగాణకు తిరిగి వచ్చిన తర్వాత కల్వకుంట్ల తారకరామారావు ఈనెల 26వ తేదీన అమెరికాకు పయనం అవుతారు. డల్లాస్ లో జరిగే పార్టీ రజతోత్సవ వేడుక కార్యక్రమంలో.. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పాల్గొంటారు. కేటీఆర్ తో పాటు హరీష్ రావు మరికొంతమంది లీడర్లు కూడా వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా అమెరికాకు వెళ్తారని మొన్నటి నుంచి ప్రచారం జోరుగా సాగుతోంది. అమెరికాలో మెరుగైన వైద్యం కోసం కేసీఆర్ వెళ్తున్నారని చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది. మొత్తానికి కుటుంబం మొత్తం అమెరికాకు ఇదే నెలలో వెళుతుందని చెబుతున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు