
ప్రజలతో మమేకమై వారి నుంచి ఫిర్యాదులు , వినతులు విన్నపాలు స్వీకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు .. సినిమా థియేటర్లో స్క్రీన్ ద్వారా ప్రజలతో ముఖాముఖి జరుపబోతున్నారు .. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో రావివలస గ్రామ ప్రజలతో పవన్ ముందుగా మాట్లాడనున్నారు . అక్కడ ఉన్న ప్రజల్లో 290 మందిని స్థానిక భవాని థియేటర్‌కు తీసుకు వెళుతున్నారు . అక్కడ పవన్ ప్రజల సమస్యలను వింటారు .
అభిమానుల తాకిడి భద్రత కారణాలు దృష్ట్యా గ్రామీణ ప్రజలతో ప్రత్యక్ష పర్యటనల్లో పెద్దగా ఆయన వారితో మమేకమై మాట్లాడలేకపోతున్నారు .. అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు .. మంగళగిరి లోని తన క్యాంప్ కార్యాలయం నుంచి పవన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు . ప్రధానంగా గ్రామాల్లో తాగు సాగునీరు , రోడ్లు , మూర్ఖు కాలువలు , ఉపాధి హామీ పథకం , పాఠశాల విద్య , నిరుద్యోగం , చెరువులు తదితర సమస్యలపై చర్చించి పరిష్కారం చూపిస్తారు .. ఇతర ప్రాంతాల్లో కూడా సాగుతుంది సినిమా స్క్రీన్ పై పవన్ తో మాట్లాడటం వల్ల నేరుగా చూస్తామన్న భావన ప్రజల్లో కలుకుతుందని కారణంగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం నుంచి వార్తలు వస్తున్నాయి .. ఇక మరి ఈ వినూత్న కార్యక్రమం తో డిప్యూటీ సీఎం ప్రజలకు మరింత దగ్గర అవటం ఖాయమని కూడా అంటున్నారు ...