తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంట్లో కొత్త రాజకీయాలు బయటకు వస్తున్నాయి. జైలు నుంచి వచ్చిన కల్వకుంట్ల కవిత... కెసిఆర్ పై తిరుగుబాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తాజాగా కల్వకుంట్ల కవిత లేఖ రాసినట్లు.. ఓ మీడియా సంస్థలు వార్తలు వస్తున్నాయి. ఆ లేఖ ప్రకారం... కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. వరంగల్ సభలో కెసిఆర్... స్టేజి పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందని... కవిత లేఖలో సూచించారట.


2001 సంవత్సరం నుంచి పార్టీలో ఉన్న నాయకులు ఆ సభలో మాట్లాడితే బాగుండేదని కవిత సూచించినట్లు సమాచారం అందుతుంది.  భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉండాలని... ఆ పార్టీ వల్ల తనకు చాలా ఇబ్బంది జరిగిందని కవిత స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుండేదని... పోటీ చేయకపోవడం వల్ల బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు... మెసేజ్ జనాల్లోకి వెళ్లిందని ఆమె స్పష్టం చేశారు.

ఇప్పటికైనా ఈ విషయాలపై కేసీఆర్ స్పందించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని... సూచించినట్లు కవిత లేఖ వైరల్ గా మారింది. ఈ పొలిటికల్ సినారియోను అడ్రెస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా భావించారని కవిత తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా 1-2 ప్లీనరీ పెట్టాలని లేఖలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందొ తెలియాల్సి ఉంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

 

మరింత సమాచారం తెలుసుకోండి: