ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది. కొంతకాలం క్రితం మంత్రివర్గ సమావేశం నిర్వహించగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు తాజాగా వెలువడటం గమనార్హం. మాజీ సీఎం వైఎస్సార్ మరణానంతరం కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చారు.
 
ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రాగా వైసీపీ వైఎస్సార్ కడప జిల్లా పేరును వైఎస్సార్ జిల్లాగా పేరు మార్చింది. అయితే ఆ సమయంలో కొంతమంది ప్రజల నుంచి ఈ నిర్ణయం విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలో పేరు మార్పు గురించి హామీ ఇవ్వడం జరిగింది.
 
మంత్రి సత్యకుమార్ సైతం వైఎస్సార్ జిల్లా పేరు మార్పుకు సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కడప అనే పదం లేకుండా వైఎస్సార్ జిల్లాగా మార్చడాన్ని తప్పుబట్టారు. ప్రజల నుంచి కూడా ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి వినతులు వచ్చాయని సమాచారం అందుతోంది. ఈ నిర్ణయంపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
 
అయితే భవిష్యత్తులో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనే చర్చ సైతం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ మాత్రం భవిష్యత్తులో కూటమి నిర్ణయాలను వ్యతిరేకించడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ భవిష్యత్తులో అధికారంలోకి రావడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తుండటం ఒకింత సంచలనం  అవుతోంది. జగన్ సైతం కూటమి పాలనపై తరచూ విమర్శలు చేయడం ద్వారా ఒకింత సంచలనం అవుతుందనే సంగతి తెలిసిందే. కూటమి విషయంలో జగన్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: