తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో అనేక ఆసక్తికర పరిణామాలు వెలుగు చూస్తున్నాయి .. ఇక‌ వీటిలో నారా లోకేష్ కు కీలక పదవి రాబోతున్న సమాచారం కూడా ఒకటి .. పార్టీ నాయకులకు ఆనందం ఇచ్చేలా చేసింది మరొకటి ఆయనే ప్రతిపాదించిన టిడిపి యువ నేతలకు సూపర్ సిక్స్ ను కూడా వేదికగా ఆమోదించబోతున్న‌రు .. అలాగే ఈ రెండిటితో పాటు మరో 14 తీర్మానాలు కూడా ఇక్కడ చేయనున్నారు .. ఇవి నానానికి ఒకవైపు మాత్రమే .. మరోవైపు నాయకులను ఉత్కంఠ‌కు గురిచేస్తున్న కీలక పరిణామాలు కూడా ఇక్కడ చోటు చేసుకోబోతున్నాయి .


అవే నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పు . దీనిపై కసరత్తు దాదాపు ఇప్పటికే పూర్తయింది .. రెండో రోజు , లేదా మూడో రోజు మహానాడులో మొత్తం 42 నియోజకవర్గాలు ఇన్చార్జిలను మార్పు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి .. రీసెంట్ గానే 101మందికి నామినేట్ పదవులు ఇచ్చారు .. అలానే కొందరికి ఎమ్మెల్సీలు కూడా ఇచ్చారు ఇప్పుడు పార్టీ ఇన్చార్జీల పదవులు కూడా ఇవ్వనున్నట్టు చెబుతున్నారు .. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా ఈ మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది ఇప్పుడు ఇదే ఎంతో ఆసక్తిగా మారింది .



స‌హ‌జంగా ఏ పార్టీలో అయినా ఎమ్మెల్యేలు ఉన్నచోట వారే నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఉంటారు .. కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వివాదాలు విభేదాలతోనే కాలం గడుపుతున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు .. ఇక ఇప్పుడు వీరిని తాజాగా గుర్తించారు .. గతంలో రెండు నుంచి మూడుసార్లు హెచ్చరించారు .. అయినా కూడా వారిలో మార్పు రాలేదు .. ఈ పరిణామాలను పకడ్బందీగా గమనించిన నియోజకవర్గాల్ల  ఇన్చార్జిలను మార్చబోతున్నట్టు తెలుస్తుంది .. వాటిలో ప్రధానంగా 11 ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు ఉన్నాయి .



ఆ ఎమ్మెల్యేలపై పార్టీ నాయకులకు ఫిర్యాదు రావడం .. అలాగే నాయకులు పార్టీ హైకామాండ్‌ను కూడా లెక్కచేయకుండా ఉండటం వంటివి ఉన్నట్టు కూడా తెలుస్తుంది .. ప్రధానంగా ఆళ్లగడ్డ ,జగ్గయ్యపేట ,కడప తిరువూరు .. నియోజకవర్గాలు ఎప్పుడు వివాదాలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి .. అలాగే ఇక్కడ ఓ మంత్రి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఎవరి మా నానా వారు ఉన్నారన్న చర్చ కూడా గట్టిగా నడుస్తుంది .. అలాగే దీనిపైన పలుమార్లు ఎన్నో హెచ్చరికలు వచ్చినా మార్పు రాకపోవడంతో .. ఇలాంటి సంచలన మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు .. ఈ మహానాడు వేదికగా ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకుంటూ కొత్తవారికి కొత్త అవకాశాలు ఇస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: